తెలంగాణ: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, ప్రమాద తీవ్రత 11 ఫోటోలలో
ఫొటో క్యాప్షన్, బస్సుని ఢీ కొట్టి టిప్పర్ లోపలకు దూసుకెళ్లింది. కంకరలో చాలా భాగం బస్సులో పడటంతో సగం బస్సు రాళ్లతో నిండిపోయింది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఫొటో క్యాప్షన్, నామరూపాల్లేకుండా పోయిన బస్సు లోపలి భాగం
ఫొటో సోర్స్, Video scereengrab/UGC
ఫొటో క్యాప్షన్, బస్సుపై టిప్పర్ పడటంతో , బస్సు లోపల చిక్కుకుకుపోయినవారిని బయటకు తీయడం కష్టమైంది
ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో 14మంది మహిళలు, నలుగురు పురుషులు, ఒక పసికందు ఉన్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పారు.
బస్సులో 72 మంది ఉన్నట్లు కండక్టర్ తెలిపారని తెలంగాణ ఏడీజీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
ఫొటో క్యాప్షన్, బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఫొటో క్యాప్షన్, జేసీబీతో బస్సును తొలగిస్తున్న దృశ్యం
ఫొటో క్యాప్షన్, నామరూపాల్లేకుండా పోయిన ఆర్టీసీ బస్సు
ఫొటో క్యాప్షన్, ప్రమాదం జరిగిన చోట గుమిగూడిన ప్రజలు
ఫొటో క్యాప్షన్, ప్రమాదంలో గాయపడి చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు.
ఫొటో సోర్స్, Video Screen grab/UGC
ఫొటో క్యాప్షన్, బస్సు, టిప్పర్ ముందు భాాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఫొటో క్యాప్షన్, మార్చురీ వద్ద ఎదురుచూస్తున్న మృతుల కుటుంబాలు