దిల్లీలో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

మోదీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

(గమనిక: ఇవి కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, వాస్తవ ఫలితాలు శనివారం వెల్లడవుతాయి)

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో సాయంత్రం 5 గంటలకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

ఫిబ్రవరి 8న అధికారికంగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.

తాజా ఎన్నికల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తలపడ్డాయి.

ఆప్ వరుసగా 2015, 2020లో అధికారాన్ని చేజిక్కించుకుంది.

2015లో ఆ పార్టీ 67 స్థానాలు గెలుచుకోగా, 2020లో 62 సీట్లు గెలుచుకుంది.

మరోపక్క బీజేపీ ఈసారి ఎలాగైన దిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించింది. గడిచిన ఆరు ఎన్నికలలో ఆ పార్టీ అధికారాన్ని అందుకోలేకపోయింది.

చివరిసారిగా బీజేపీ 1993లో గెలిచింది. 1993లో 49 సీట్లతో భారీ గెలుపు సాధించినప్పటికీ, ఐదేళ్ల కాలంలో దిల్లీ ముఖ్యమంత్రిని బీజేపీ మూడుసార్లు మార్చింది.

బీజేపీ తొలిసారి మదన్ లాల్‌ ఖురానాను, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మను, చివరికి సుష్మా స్వరాజ్‌ను దిల్లీ ముఖ్యమంత్రిగా చేసింది.

2013లో 70 అసెంబ్లీ సీట్లున్న దిల్లీ అసెంబ్లీలో 31 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లను, 2020లో 8 సీట్లను మాత్రమే పొందింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎగ్జిట్ పోల్స్

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం ఖాయమని పలు సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్‌ మీడియాలో ప్రసారమయ్యాయి.

మాట్రైజ్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37 మధ్యన సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌కు 0 నుంచి 1 స్థానం వస్తుందని అంచనా వేసింది.

అలాగే పీపుల్స్ ఇన్‌సైట్ సంస్థ ఆప్‌కు 25 నుంచి 29 స్థానాలు, బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం దక్కుతుందని చెప్పింది.

పి-మార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 39 నుంచి 49 స్థానాలు, ఆప్ 21 -31 స్థానాలు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం సాధించవచ్చని తెలిపింది.

జేవీసీ ప్రకారం ఆప్‌కు 22 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 45, కాంగ్రెస్ 0 నుంచి 2 స్థానాలు గెలుచుకునే అవకాశమందని తన ఎగ్జిట్ పోల్స్‌లో తెలిపింది.

ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, codemo/peoplespulse

పీపుల్స్ పల్స్ -కొడెమో సర్వే

పీపుల్స్ పల్స్ - కొడిమో సంయుక్తంగా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ దిల్లీ పీఠాన్ని బీజేపీ గెలచుకుంటోందని చెప్పాయి.

బీజేపీ 51 నుంచి 60 స్థానాలు, ఆప్ 10 నుంచి 19 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేశాయి.

కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఆప్‌ 36.5 నుంచి 40.5 శాతం ఓట్లు, బీజేపీ 48.5 నుంచి 52.5 శాతం ఓట్లు సాధిస్తాయని, కాంగ్రెస్ 6.5 నుంచి 8.5శాతం ఓట్లు రావచ్చని తెలిపింది. ఇతరులు 3.1 నుంచి 5.1 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

చాణక్య స్ట్రాటజీస్ దిల్లీలో బీజేపీకి మెజార్టీ స్థానాలు వస్తాయని లెక్కగట్టింది.

బీజేపీ: 39-44

ఆప్: 25-28

కాంగ్రెస్, 02-03 స్థానాలు సాధించే అవకాశం ఉందని తన ఎగ్జిట్‌పోల్స్‌లో తెలిపింది.

ఇక పోల్ డైరీ ఎగ్జిట్‌పోల్స్ కూడా బీజేపీకి పట్టం గట్టాయి. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం

ఆప్: 18-25

బీజేపీ: 42-50

కాంగ్రెస్: 0-2 స్థానాలు సాధించవచ్చని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)