ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్

వీడియో క్యాప్షన్, ఇమ్మానుయేల్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారంటున్న ప్రతిపక్ష పార్టీ సభ్యులు..
ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పదవీ విరమణ వయసును 62 నుంచి 64కి పెంచుతూ అధ్యక్షుడు ఇమ్మాన్యేల్ మేక్రాన్ తీసుకొచ్చిన పెన్షన్ సంస్కరణలతో ఈ ఆందోళనలు రాజుకున్నాయి.

రాజ్యాంగంలో నిబంధనను ఉపయోగించుకుని పార్లమెంట్ అనుమతి లేకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫ్రాన్స్‌లో అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

అధ్యక్షుడిపై ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం 9 ఓట్ల తేడాతో వీగిపోయింది. దీంతో ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)