కర్నాటక: ‘‘మైకుల్లో ప్రార్థించకుంటే అల్లాకు వినపడదా..’’ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... మరి నిబంధనలు ఏం చెబుతున్నాయి

ఫొటో సోర్స్, Facebook/BJP Karnataka
కర్నాటకలో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
''మనకు బాబ్రీ మసీదు అవసరం లేదు. రామ జన్మభూమి కావాలి'' అని ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అన్నారు.
''బీజేపీని మనం అధికారంలోకి తీసుకొని రావాలి. మనకు బాబ్రీ మసీదు ఇక ఏ మాత్రం వద్దు. మనకు రామ జన్మభూమి కావాలి. లండన్‌లో భారత్‌ను అవమానించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కానీ మోదీజీ ఉన్నంత వరకు మీరు ఈ దేశం ప్రధాని కాలేరు... అని ఆయనకు చెప్పాలనుకుంటున్నా.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం అమృత కాలంలో విశ్వగురువు అవుతుంది'' అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, BJP Karnataka/Facebook
ఇక కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప కూడా ముస్లింల 'అజాన్' మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
''నేను ఎక్కడికి వెళ్లినా అదొక(అజాన్) అదొక పెద్ద తలనొప్పిగా మారింది. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి త్వరలోనే ఈ తీరు మారుతుంది. అందులో అనుమానం లేదు.
అన్ని మతాలను గౌరవించమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
కానీ మైకులో అరిస్తేనే అల్లాకు వినిపిస్తుందా? అని అడగాలనుకుంటున్నా.
హిందువులు కూడా దేవాలయాల్లో ప్రార్థిస్తారు. మాకు వాళ్ల కంటే విశ్వాసం ఎక్కువ. భారత మాత అన్ని మతాలను కాపాడుతోంది.
మైకుతో ప్రార్థిస్తేనే అల్లాకు వినపడుతుందని ఒకవేళ మీరు అంటే ఆయనకు చెవుడా అని నేను తప్పకుండా ప్రశ్నిస్తా.
ఈ(మైకుల్లో అజాన్) సమస్యను తప్పకుండా పరిష్కరించాలి'' అని ఈశ్వరప్ప అన్నారు.
మంగళూరులో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే మైకుల్లో అజాన్ వల్ల విద్యార్థులు చదవలేక పోతున్నారని, తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని ఈశ్వరప్ప అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
''ప్రస్తుతం కర్నాటకలో పరీక్షలు జరుగుతున్నాయి. అజాన్, లౌడ్ స్పీకర్ల వల్ల సరిగ్గా చదవలేక పోతున్నట్లు తల్లిదండ్రులు, విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. అది మంచిది కాదు'' అని ఈశ్వరప్ప అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
మసీదుల్లో మైకుల మీద చట్టాలు ఏం చెబుతున్నాయి?
మసీదుల్లో మైకులు వాడటమనేది ఇస్లాంలో అతి ముఖ్యమైన సంప్రదాయం కాదని గతంలో అలహాబాద్ హై కోర్టు వ్యాఖ్యానించింది. మైకుల్లో అజాన్ ప్రసారం చేయడం మీద ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో 2020లో కొందరు అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. 'అజాన్ అనేది ఇస్లాంలో ఉండే ఒక సంప్రదాయం. కానీ మైకుల్లో అజాన్ ప్రసారం చేయడమనేది ముఖ్యమైన మత సంప్రదాయం కాదు. కాబట్టి మసీదుల్లో మైకులు లేకుండానే అజాన్ పఠించ వచ్చు.' అని నాడు కోర్టు వ్యాఖ్యానించింది. ధ్వని కాలుష్య నిబంధనల ప్రకారం అనుమతులు లేని వారు మైకుల్లో అజాన్ పఠించకూడదని కోర్టు తెలిపింది. అనేక సందర్భాల్లో ఆయా కోర్టులు ప్రార్థనా మందిరాలు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం లేకుండా చూడాలంటూ ప్రభుత్వాలను ఆదేశించాయి.

ఫొటో సోర్స్, AFP
నిబంధనలు ఇలా...
- ధ్వని కాలుష్య నియంత్రణ నిబంధనలు-2000 ప్రకారం మైకులు, లౌడ్ స్పీకర్లు, ఇతర పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్‌ను అనుమతి లేనిదే వాడకూడదు. ఇందుకు అధికారుల నుంచి కచ్చితంగా రాతపూర్వక అనుమతి ఉండాలి.
- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మైకులు, మ్యూజిక్ సాధనాలు, సౌండ్ యాంఫిల్‌ఫైర్స్ వంటి వాటిని వాడకూడదు. కాకపోతే ఆడిటోరియం, కమ్యూనిటీ హాల్స్ వంటి క్లోజ్డ్ ప్రిమిసెస్‌లో వాటిని ఉపయోగించవచ్చు. లేదా పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలోనూ వాడొచ్చు.
- రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, రాష్ట్రాల అవతర దినోత్సవాలు, పండగలు, సాంసృతిక ప్రదర్శనలు, మతపరమైన కార్యక్రమాల సమయంలో కొన్ని పరిమితుల మధ్య రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మైకులు వాడేందుకు అధికారులు అనుమతులు ఇవ్వొచ్చు. అయితే ఏడాదిలో 15 రోజులు మాత్రమే ఇందుకు అనుమతించాలి.
- నివాస ప్రాంతాల్లో పగలు ధ్వని తీవ్రత 55 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. రాత్రి పూట 45 డెసిబెల్స్ మించరాదు. ఇక్కడ పగలు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. రాత్రి అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు.
- మైకులు ఉన్న ప్రాంతంలో ధ్వని తీవ్రత ఆ ప్రాంతంలో అనుమతించి ప్రమాణాలకు అదనంగా 10 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
ఇవి కూడా చదవండి
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్- వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా-’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా-
- ఉద్యోగం కోసం చూస్తున్నారా..- అయితే ఇక్కడ మీకు దొరకొచ్చు
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన శారూ... ప్రేమతో నీ రాజా'
- ది ఎలిఫెంట్ విస్పరర్స్- ‘ఆస్కార్ వచ్చింది కానీ ఇప్పుడు మా రఘు మాతో లేనందుకు బాధగా ఉంది’ - బొమ్మన్, బెల్లీ
- ఆస్కార్ 2023- ‘‘నాటునాటు’’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు... రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









