పేరు మార్చుకున్న ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, టామ్ బేలీ, ప్యాట్రిక్ జాక్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్'లో తన పేరు మార్చుకున్నారు.
మస్క్ తన పేరును 'కెకియస్ మ్యాక్సిమస్'గా మార్చుకోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడైన మస్క్ 'ఎక్స్'లో తన కొత్త ప్రొఫైల్ ఫొటో పెట్టారు. దాంతో పాటు పేరును మార్చారు.
ప్రొఫైల్ ఫొటోగా 'పెపె ద ఫ్రాగ్' వాడారు. అమెరికాలో ఫార్ రైట్ గ్రూప్‌లు ఈ మీమ్ వాడుతుంటారు.
మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో కదలిక తెచ్చింది. మస్క్ తన ప్రొఫైల్‌లో చేసిన మార్పుల తరువాత ఆయన ప్రొఫైల్ ఫొటోగా ఉంచిన క్యారక్టర్ పేరుతో ఉన్న ఓ మీమ్ కాయిన్ ధర పెరిగింది.
గతంలోనూ మస్క్ సోషల్ మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలతో క్రిప్టో కరెన్సీల ధరలపై ప్రభావం చూపించారు.
అయితే, ఇప్పుడు ఈ క్రిప్టో కాయిన్ విషయంలో మస్క్ జోక్యం ఏమైనా ఉందా అనేది ఇంకా స్పష్టం కాలేదు.


ఫొటో సోర్స్, Elon Musk
కెకియస్ అంటే 'లాఫ్ అవుట్ లౌడ్' అని అర్థం వచ్చే లాటిన్ పదం 'కెక్'కు విస్తృత రూపం కావొచ్చన్న వాదన ఒకటి ఉంది.
ప్రాచీన ఈజిప్ట్‌లో చీకటికి రాజుగా అభివర్ణించే ఓ రూపానికి పేరు కూడా కెక్. ఈ రూపం కూడా కప్పలాగే ఉంటుంది.
ఇక మ్యాక్సిమస్ పదం విషయానికొస్తే గ్లాడియేటర్‌లో రసెల్ క్రో పేరు అదేనంటున్నారు కొందరు. ఆ సినిమాలో రసెల్ పేరు మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














