వికలాంగులైనా.. ఈ మహిళా క్రికెటర్లు బౌండరీలు బాదేస్తున్నారు

వీడియో క్యాప్షన్, ఈ వికలాంగ మహిళలు ఆత్మవిశ్వాసంతో క్రికెట్‌లో తమకంటూ కొత్త గుర్తింపును తెచ్చుకుంటున్నారు.
వికలాంగులైనా.. ఈ మహిళా క్రికెటర్లు బౌండరీలు బాదేస్తున్నారు

భారత్‌లో మహిళా క్రికెట్ కొత్త ఎత్తులకు చేరుకుంటోంది. కానీ, వికలాంగులైన మహిళలకు మాత్రం రాష్ట్ర స్థాయిలో జట్లు గానీ, ఆడడానికి మ్యాచ్‌ల నిర్వహణగానీ ఉండడం లేదు.

అయినా ఆ మహిళలు ఆత్మవిశ్వాసంతో క్రికెట్‌లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును తెచ్చుకుంటున్నారు.

తస్నీమ్, లలిత దేశంలోని రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. వీరిలో ఒకరేమో రోజూ క్రికెట్ చూస్తూ పెరిగితే, మరొకరికి అసలు ఆటలను చూసే అవకాశమే ఉండేది కాదు.

కానీ, ఈ రోజు వీరిద్దరూ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్లు. భారత తొలి వికలాంగ మహిళల క్రికెట్ జట్టుకు వారు ప్రాతినిధ్యం వహించారు.

క్రికెట్ మాత్రమే కాకుండా వారిద్దరిలో ఉన్న మరో ఉమ్మడి అంశం ఏంటంటే ఇద్దరూ పోలియో బాధితులు.

మహిళలకు కోసం ప్రత్యేకంగా చేపట్టిన ‘బీబీసీ షీ' ప్రాజెక్టులో భాగంగా ‘ద బ్రిడ్జ్’ మీడియా సంస్థతో కలిసి బీబీసీ ఈ కథనాన్ని మీ ముందుకు తెచ్చింది.

గుజరాత్‌లో జరిగిన క్రికెట్ క్యాంపులో పాల్గొన్న వికలాంగ మహిళల క్రికెట్ జట్టు
ఫొటో క్యాప్షన్, గుజరాత్‌లో జరిగిన క్రికెట్ క్యాంపులో పాల్గొన్న వికలాంగ మహిళల క్రికెట్ జట్టు

ఇవి కూాడా చదవండి: