క్రికెట్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన పదేళ్ల తర్వాత మళ్లీ మహిళల ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్న తెలుగు క్రీడాకారిణి స్నేహ దీప్తి

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: క్రికెట్‌కు దూరమైన పదేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్న స్నేహ దీప్తి

రెండేళ్ల పాపకు తల్లైన స్నేహ దీప్తి మహిళల ప్రీమియర్ లీగ్‌లో బరిలోకి దిగుతున్నారు. డబ్ల్యూపీఎల్‌ వేలంలో ఆమెను 30 లక్షల రూపాయలకు దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

స్నేహ దీప్తి 2013లో భార‌త్ క్రికెట్ జ‌ట్టుకు ఎంపికైన స్నేహ దీప్తి, అదే ఏడాది బంగ్లాదేశ్‌‌తో రెండు టీ20లు, ఒక వన్డే ఆడారు. ఆ తర్వాత ఆటకు దూరమయ్యారు.

పాప పుట్టిన తర్వాత తాను చాలా బరువు పెరిగానని విశాఖపట్నం నివాసి అయిన స్నేహ దీప్తి చెప్తున్నారు.

‘‘ప్రెగ్నెన్సీ తర్వాత శరీరంలో వచ్చే మార్పులు వస్తాయి.. మన మీద నమ్మకం తగ్గుతుంది.. నాకూ అలాగే జరిగింది. నేను ఇది చేయలేను అనుకున్నాను’’ అని ఆమె చెప్పారు.

ఆ పరిస్థితి నుంచి తానెలా గట్టెక్కారో, పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆటకు ఎలా దగ్గరయ్యారో బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)