బీజింగ్: చైనా భారీ మిలిటరీ పరేడ్‌లో ఏమేం ప్రదర్శించారు.. 9 ఫోటోలలో

చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలిసారిగా షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ఒక వేదిక మీద కనిపించారు.

రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయినందుకు గుర్తుగా చైనా నిర్వహించిన భారీ మిలటరీ పరేడ్‌లో ఫైటర్ జెట్లు, మిస్సైళ్లు, ఖండాంతర క్షిపణులు, అణు క్షిపణులతో తన ఆయుధ బలాన్ని ప్రదర్శించింది.

బీజింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాల నేతలు హాజరయ్యారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భార్యతో కలిసి విదేశీ అతిధులను ఆహ్వానించారు.

చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో చైనా సైన్యం క్రమశిక్షణ, శక్తిని ప్రదర్శించిన మహిళా సైనికులు
చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, EPA

  • విక్టరీ పరేడ్‌లో భాగంగా చైనా సైన్యం తమ వద్ద ఉన్న లేజర్ ఆయుధాలు., న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్, జెయింట్ అండర్ వాటర్ డ్రోన్స్‌ను ప్రదర్శించింది.
  • ఈ కార్యక్రమానికి ముందు ప్రసంగించిన షీ జిన్‌పింగ్ చైనాను ఏ శక్తి ఆపలేదని, తమపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు.
  • మరోపక్క చైనా, రష్యా , నార్త్ కొరియా కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు.
చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, Lintao Zhang/Getty

ఫొటో క్యాప్షన్, విక్టరీ డే పరేడ్‌లో యుద్ధ ట్యాంకుల ప్రదర్శన
చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విక్టరీ డే పరేడ్‌లో ప్రదర్శించిన డాంగ్‌ఫెంగ్ 61 మిసైల్
  • పరేడ్‌లో 10వేల మంది సైనికులు కవాతు నిర్వహించారు.
  • తొలిసారిగా షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ఒక వేదిక మీద కనిపించారు.
  • పరేడ్‌లో ఆయుధాల ప్రదర్శనలో భాగంగా చైనా తమ వద్ద ఉన్న భూతల, జలమార్గాలలో ఉపయోగించగలిగిన ఎయిర్ డిఫెన్స్ లేజర్లు, స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలు, యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రదర్శించింది.
చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెచ్ఎస్‌యూ100 నీటి కింద దూసుకుపోయే మానవ రహిత వాహనం
చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లతో విన్యాసాలు నిర్వహించింది.
చైనా విక్టరీ డే, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, బీజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా గగనతలంలో ఫైటర్‌జెట్లు
చైనా పరేడ్

ఫొటో సోర్స్, VCG/VCG via Getty

  • ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 50 లక్షల మంది బీజింగ్ చేరుకున్నారని చైనా అధికారిక మీడియా సీసీ టీవీ తెలిపింది.
  • ప్రజలు చైనా జెండాలతో హర్షాతిరేకాలు తెలుపుతూ, జాతీయ గీతం పాడుతున్న వీడియోలను ప్రసారం చేశారు.
  • చైనాలో నియంత్రణ ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ దేశభక్తిని ప్రదర్శిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు.
  • విక్టరీ పరేడ్ సందర్భంగా బీజింగ్‌లో పర్యటక ప్రదేశాలు, రెండ ప్రపంచ యుద్ధ కాలం నాటి గుర్తులను ప్రదర్శించే మ్యూజియాలను ప్రజలు భారీ సంఖ్యలో సందర్శించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)