రిషి సునక్: భారత్‌ను ఏలిన బ్రిటన్‌కు ప్రధాని అయిన రిషి గురించి ప్రజలు ప్రైవేటుగా ఏమనుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సీమ కొటేచా
- హోదా, యూకే ఎడిటర్, బీబీసీ న్యూస్‌నైట్
కొన్ని వందల ఏళ్ల పాటు భారత్‌తో సహా ఎన్నో ఆఫ్రికా దేశాలను వలసగా చేసుకుని బ్రిటన్ పాలించింది.
ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ ఆ దేశానికి ప్రధాని కాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకొంటున్న హిందువులకు ఇది చాలా మంచి వార్త.
భారత కుటుంబాల వాట్సాప్ గ్రూపులలో రిషి ప్రధాని కావడం మీద ఎన్నో మెసేజ్స్, మీమ్స్ కనిపించాయి.
సాధారణంగా కుటుంబాల వాట్సాప్ గ్రూపులలో జోకులు, పనికిరాని సమాచారం, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు సంబంధించిన సందేశాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ గ్రూపులు మీమ్స్, వీడియోస్‌తో పాటు కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి.
రిషి ప్రధాని అవుతున్నారని తెలియగానే ఒక తల్లి, కొడుకు మధ్య సంభాషణ ఇలా జరిగింది.
తల్లి: 'అది రిషినే'
కొడుకు: 'వావ్'
తల్లి: 'మన కల నిజమైంది'

భారత్‌లో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల వినియోగదారుల్లో సుమారు 39 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు.
ఒకనాడు భారత ఉపఖండాన్ని ఏలిన బ్రిటన్‌ను నేడు తూర్పు ఆఫ్రికా-భారత సంతతికి చెందిన రిషి పాలించనున్నారు. ఈ వార్త కొంత మందికి షాక్ కలిగించేది కూడా.
'రిషి, బ్రిటన్ ప్రధాని అవుతున్నారు' అనే వార్త ఒక దావానలంలా వ్యాపించింది. దీపావళి రోజునే ఇది రావడం చాలా మంది సంతోషాన్ని మరింత పెంచింది.
దక్షిణాసియా వాట్సాప్ గ్రూపుల ద్వారా నాకు చేరిన కొన్ని సందేశాల్లో కొంతమంది గర్వంగా ఫీలవుతునట్లుగా తెలుస్తోంది.
'మనం సాధించాం' అనే సందేశాలు కనిపించాయి.
కానీ మరికొందరి సందేశాల్లో కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి.
'అంటే, దీన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలా?'
'మనలో చాలా మంది కంటే ఆయన భిన్నం. ఆయన మన మాదిరిగా కాదు. మిగతా మంత్రుల మాదిరిగానే ఆయన కూడా పోష్, రిచ్.'

వాట్సాప్ గ్రూపుల బయట కూడా ఆయన గురించి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
బర్న్‌లీలోని పార్క్‌లేన్‌లో బార్బర్‌గా పని చేస్తున్నారు అతీఖ్ ఆజం.
'దక్షిణాసియా సంతతి ప్రజలకు ఇది చాలా పెద్ద విజయం. మాకు కూడా అవకాశాలు ఉన్నాయనేందుకు ఇది ఉదాహరణగా కనిపించింది.
కష్టపడితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపిస్తోంది. పని ఎలా చేస్తున్నారు అనేది చూడాలి కానీ ఒంటి రంగు ముఖ్యం కాదని నేను భావిస్తున్నా' అని అతీఖ్ అన్నారు.
బ్రిటన్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, అనూహ్య పరిణామాలను భారత్ ప్రజలు దగ్గరగా గమనించకపోవచ్చు. అందువల్లే వారి వాట్సాప్ గ్రూపుల్లో రిషి రాజకీయ జీవితం కంటే కూడా ఆయన కుటుంబం, మతం గురించే ఎక్కువ చర్చ, సందేశాలు కనిపించాయి.
రిషి సునాక్ తాతలది పంజాబ్. కాబట్టి ఆయన ప్రధాని కావడాన్ని భారత ప్రజలు గర్వంగా భావించొచ్చు. అలాగే భారత్‌కు చెందిన సంపన్న మహిళను ఆయన పెళ్లి చేసుకున్నారు.
బరాక్ ఒబామా రూపంలో అమెరికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు వచ్చిన 14 ఏళ్ల తరువాత బ్రిటన్‌లో తొలిసారి తెల్లజాతికి చెందని వ్యక్తి ఆ దేశ ప్రధాని అవుతున్నారు.

మరి దీన్ని బ్రిటన్లు ఎలా చూస్తారు?
తొలి బ్రిటిష్ ఆసియా ప్రధానిగా రిషి సునక్, అందరినీ కలుపుకొని పోవడం, సంస్కృతులను అర్థం చేసుకోవడం చేయాలని కచ్చితంగా ప్రజలు కోరుకుంటారు.
తాను హిందువుగా ఉంటూనే బ్రిటన్ గర్వించదగ్గ పౌరునిగా ఉంటానని గతంలోనే రిషి సునక్ చెప్పారు.
'ఆయన చాలా ధనవంతుడు. మన లాంటి వాడు కాదు. మన జీవితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకునే అవగాహన ఆయనకు ఉండదు' అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తన ఒంటి రంగును పక్కన పెడితే ఇలాంటి అభిప్రాయాలను కూడా ఆయన అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
వాట్సాప్ గ్రూపుల్లో కొందరు ఇలా చర్చించుకుంటున్నారు...
కజిన్ 1: 'ఆయన నిజంగానే కియా నడుపుతారా?'
కజిన్ 2: 'లేదు'
ఇవి కూడా చదవండి:
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- పవన్ కల్యాణ్ జనసేన దారేది?
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













