Netherlands: ట్విటర్ తమ పట్టణంపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కేసు వేసిన ప్రజలు

ఫొటో సోర్స్, Google
సాతానును ఆరాధిస్తూ, చిన్నారులతో సంభోగించే ముఠాలకు ఒకప్పుడు తమ ఊరు నిలయమంటూ ట్విటర్ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ నెదర్లాండ్స్ పట్టణం బోడోగ్రాఫెన్ రీవాక్ ప్రజలు కోర్టుకెక్కారు.
బోడోగ్రాఫెన్ రీవాక్‌లో 1980 ప్రాంతంలో అనేక మంది చిన్నారులను లైంగికంగా వేధించి హతమార్చారంటూ తప్పుడు నివేదికను ఒకదాన్ని 2020లో తొలిసారి ఓ ముగ్గురు వ్యక్తులు ప్రచారంలోకి తెచ్చారు.
ఈ ప్రచారాన్ని మొదలుపెట్టిన ముగ్గురిలో ఒకరు బోడోగ్రాఫెన్ రీవాక్ నివాసి. ఈ పట్టణం 'ది హేగ్' నగరానికి సమీపంలో ఉంటుంది.
తన చిన్నతనంలో ఇలాంటి నేరాలను చూశానని ఆయన చెబుతున్నరు.
బోడోగ్రాఫెన్ ప్రజలు ఆరోపిస్తున్న ఈ పోస్టులన్నిటినీ తొలగించాలని స్థానిక అధికారులు ట్విటర్‌ను కోరారు.
ట్విటర్ వేదికగా జరిగిన ఈ ప్రచారం తరువాత చాలామంది బోడోగ్రాఫెన్ రీవాక్‌లోని రెడెరస్ట్ సిమెట్రీకి వెళ్లి అక్కడ చిన్నారుల సమాధులపై పుష్పగుచ్చాలు ఉంచారు.
కాగా ఈ ఉదంతంపై మాట్లాడేందుకు ట్విటర్ సంస్థ తరఫు లాయర్ జెన్స్ వాన్ డెన్ బ్రింక్ నిరాకరించారు. ది హేగ్‌లోని జిల్లా కోర్టులో దీనిపై విచారణ ఉండడంతో ఆయన ఏమీ మాట్లాడలేదు.
ఈ పోస్టులు పెట్టినవారు వాటిని తొలగించాలని గత ఏడాది ఇదే కోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఆరోపణలు మాత్రం ఇంకా ప్రచారంలోనే ఉన్నాయి.
కాగా బోడెగ్రాఫెన్ ప్రజల తరఫున వ్యాజ్యం వేసిన లాయర్ సీస్ వాన్ డీ సాండెన్ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ట్విటర్‌లో ఉన్న అన్ని పోస్టులనూ తొలగించాలన్న తమ అభ్యర్థనను ఆ సంస్థ పట్టించుకోలేదని ఆరోపించారు.
మరోవైపు బోడెగ్రాఫెన్ మేయర్ దీనిపై స్పందిస్తూ... 'ఇవన్నీ చాలా బాధాకరమైనవి.. కొన్నిసార్లు మరణించినవారి బంధువులకు బెదిరింపులకు కూడా ఇవి కారణమవుతున్నాయి' అన్నారని 'ఆర్టీఎల్ న్యూస్' తెలిపింది.
కాగా ఈ ఆరోపణలను మొదట ప్రచారంలోకి తెచ్చిన ముగ్గురూ ఇతర కేసుల్లో ఇప్పటికే దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రేరేపించడం.. నెదర్లాండ్స్ ప్రధాని సహా అనేక మందిని హతమారుస్తామని బెదిరించడం వంటి కేసుల్లో వీరు శిక్ష అనుభవిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- క్వీన్ ఎలిజబెత్ 2: కోహినూర్ వజ్రం, హంసలు, డాల్ఫిన్స్, ఖరీదైన కార్లు, భూములు, బంగళాలు.. కింగ్ చార్లెస్‌కు తల్లి నుంచి వారసత్వంగా ఏం వస్తున్నాయి?
- మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














