బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2 జీవితం ఛాయాచిత్రాల్లో

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాటు పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆమె తన జీవిత కాలమంతా ప్రజల సేవలోనే ఉన్నారు. బాల్యం నుంచి 70 సంవత్సరాల పాటు బ్రిటన్‌ను పాలించిన రాణి జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే ఫొటోలను చూద్దాం.

ఎలిజబెత్‌

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, చేతులు ఊపుతూ అభివాదం చేసే రాజ విధానాన్ని క్వీన్ ఎలిజబెత్ 2 చాలా చిన్నతనంలోనే నేర్చుకున్నారని చెబుతారు
1930లో జరిగిన రాయల్ స్పోర్ట్స్ ఈవెంట్ 'ఒలింపియా'‌కు హాజరయ్యేందుకు వెళుతోన్న క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1930లో జరిగిన రాయల్ స్పోర్ట్స్ ఈవెంట్ 'ఒలింపియా'‌కు హాజరయ్యేందుకు వెళుతోన్న క్వీన్ ఎలిజబెత్ 2
ఎలిజబెత్ 2తో పాటు ఆమె చెల్లెలు మార్గరెట్ రోజ్ విద్యాభ్యాసం అంతా రాజభవనంలోనే జరిగింది

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ఎలిజబెత్ 2తో పాటు ఆమె చెల్లెలు మార్గరెట్ రోజ్ విద్యాభ్యాసం అంతా రాజభవనంలోనే జరిగింది
రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ఏడాది ముందు తన కుటుంబ సభ్యులతో క్వీన్ ఎలిజబెత్ 2 ఫొటో

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ఏడాది ముందు తన కుటుంబ సభ్యులతో క్వీన్ ఎలిజబెత్ 2
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాజ కుటుంబం కొన్నాళ్లు కెనడాలో ఉండాల్సి వచ్చింది

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాజ కుటుంబం కొన్నాళ్లు కెనడాలో ఉండాల్సి వచ్చింది
1937లో ఎలిజబెత్ 2 ఒక గైడ్‌గా పని చేసినప్పటి ఫొటో

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1937లో ఎలిజబెత్ 2 ఒక గైడ్‌గా పని చేసినప్పటి ఫొటో
1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్‌తో యువరాణి ఎలిజబెత్‌ వివాహం జరిగింది

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్‌తో యువరాణి ఎలిజబెత్‌ వివాహం జరిగింది
1948లో ఈ జంటకు తొలి సంతానంగా ప్రిన్స్ చార్లెస్ జన్మించారు

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1948లో ఈ జంటకు తొలి సంతానంగా ప్రిన్స్ చార్లెస్ జన్మించారు
1950లో రెండో సంతానంగా ప్రిన్సెస్ ఆన్నె పుట్టారు

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1950లో రెండో సంతానంగా ప్రిన్సెస్ ఆన్నె పుట్టారు
క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం
1965లో క్వీన్ 39వ జన్మదినం సందర్భంగా రాజ కుటంబం విడుదల చేసిన ఫొటో

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1965లో క్వీన్ 39వ జన్మదినం సందర్భంగా రాజ కుటంబం విడుదల చేసిన ఫొటో
1977లో దాదాపు 10 వారాల పాటు 36 దేశాల్లో రాణి పర్యటించారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1977లో దాదాపు 10 వారాల పాటు 36 దేశాల్లో రాణి పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటన తర్వాత తిరిగి వచ్చిన రాణికి బ్రిటన్‌ ప్రజలు ఘన స్వాగతం పలికారు
తనకు ఇష్టమైన రోలీ కెమెరాతో క్వీన్ ఎలిజబెత్ 2, 1981 సమయం నాటి చిత్రం

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, తనకు ఇష్టమైన రోలీ కెమెరాతో క్వీన్ ఎలిజబెత్ 2. ఇది 1981 నాటి చిత్రం
1989లో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఆయన భార్య నాన్సీలతో రాణి

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1989లో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఆయన భార్య నాన్సీలతో రాణి
1947 తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికా వెళ్లిన రాణి ఎలిజబెత్ 2కు అధ్యక్షుడు నెల్సన్ మండేలా స్వాగతం పలికారు

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 1947 తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికా వెళ్లిన రాణి ఎలిజబెత్ 2కు అధ్యక్షుడు నెల్సన్ మండేలా స్వాగతం పలికారు
ఇది 2006 నాటి చిత్రం. తన 80వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన కార్డులను చూస్తోన్న క్వీన్ ఎలిజబెత్ 2

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ఇది 2006 నాటి చిత్రం. తన 80వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన కార్డులను చూస్తోన్న క్వీన్ ఎలిజబెత్ 2
2007లో క్వీన్, డైమండ్ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 2007లో క్వీన్ ఎలిజబెత్ 2 వజ్రోత్సవాన్ని జరుపుకున్నారు
2014లో బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో నటి ఏంజెలీనా జోలీతో రాణి

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 2014లో బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో నటి ఏంజెలీనా జోలీతో రాణి
2016లో రాణి తన 90 జన్మదినాన్ని జరుపుకున్నారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 2016లో రాణి తన 90 జన్మదినాన్ని జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)