విశ్వంలో ‘హార్ట్‌ బీట్’.. భూమికి వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంత నుంచి సిగ్నల్

ది కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్‌పెరిమెంట్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, 2019 డిసెంబరులో 'ది కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్‌పెరిమెంట్' ప్రాజెక్టులో డేనియల్ ఈ ఎఫ్ఆర్‌బీ గుర్తించారు.

అనంత విశ్వంలో అంతుచిక్కని విషయాలు ఎన్నో.. తాజాగా అలాంటిదే ఒకటి పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది.

పాలపుంతకు సుదూరం నుంచి వచ్చిన రేడియో సిగ్నల్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సిగ్నల్ హృదయ స్పందన(హార్ట్ బీట్)ను పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలాంటి సిగ్నల్ ఫాస్ట్ రేడియో బర్స్ట్(ఎఫ్ఆర్‌బీ) కోవలోకి వస్తుంది. అయితే ఇలాంటి సిగ్నల్‌లు గుర్తు తెలియని చోటి నుంచి వస్తాయి, బలమైన ఈ సిగ్నళ్ల నిడివి కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఉంటుంది.

అయితే, తాజాగా గుర్తించిన సిగ్నల్ మాత్రం సుమారు 3 సెకండ్ల పాటు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఎఫ్ఆర్‌బీ సాధారణ నిడివి కంటే 1,000 రెట్లు అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, 460 కోట్ల ఏళ్లనాటి ఉల్క రోడ్డు మీద పడింది

స్పష్టమైన ప్యాటర్న్‌లో ప్రతి 0.2 సెకండ్లకు ఒకసారి పునరావృతమవుతున్న బలమైన రేడియో తరంగాల వెల్లువను శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

''విశ్వంలో ఇలా ఆవర్తన సంకేతాలను కచ్చితంగా విడుదల చేసేవి ఎక్కువగా లేవు'' అని మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 'కావ్లీ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ స్పేస్ రీసెర్చ్'కి చెందిన శాస్త్రవేత్త డేనియల్ మిషెలీ చెప్పారు.

గెలాక్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గెలాక్సీ

మన గెలాక్సీలోనే ఇలాంటి ఉదాహరణలున్నాయి. భ్రమణం చెందుతూ కాంతి పుంజాలను ఉద్గారించే రేడియో పల్సర్‌లు, మాగ్నెటార్స్ వంటివి దీనికి ఉదాహరణ.

'ఈ సిగ్నల్‌లు గ్రహశకలాలపైనుండే పల్సర్‌లు కానీ మాగ్నటార్ కానీ కావొచ్చు' అని డేనియల్ అన్నారు.

ఎఫ్ఆర్‌బీ 2019221ఏగా పిలుస్తున్న ఈ రేడియో సిగ్నలే ఇంతవరకు గుర్తించినవాటిలో అత్యంత నిడివి గల ఎఫ్ఆర్‌బీ.

ఈ సిగ్నల్ కేంద్రకం భూమికి వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని మరో గెలాక్సీ ఉందని, అయితే, ఆ కేంద్రకం ఏంటనేది తెలియదని శాస్త్రవేత్తలు చెప్పారు.

వీడియో క్యాప్షన్, విశ్వం ఆవిర్భావ కాలం నాటి అద్భుత ఫొటోలు.. అవాక్కవుతున్న శాస్త్రవేత్తలు

ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన మరిన్ని సిగ్నళ్లను గుర్తించగలమన్న ఆశాభావంలో ఉన్నారు.

అదే జరిగితే సిగ్నళ్ల తరచుదనం, భూమి నుంచి ఆ కేంద్రకం దూరమవుతున్నకొద్దీ తరచుదనం ఎలా తగ్గుతోంది? విశ్వం పరిధి ఎంతగా విస్తరిస్తోంది వంటివన్నీ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

2019 డిసెంబరులో 'ది కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్‌పెరిమెంట్' ప్రాజెక్టులో డేనియల్ ఈ ఎఫ్ఆర్‌బీ గుర్తించారు.

వీడియో క్యాప్షన్, ఆకాశం నుంచి రాలిపడిన అగ్ని గోళాలు.. ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)