Covid19 Vaccine Profits: ‘ఎంత లాభం వస్తే సరిపోతుంది? సరిపడా లాభాలు తీసుకున్నారుగా.. ఇక ప్రజల ప్రాణాలకు ప్రయార్టీ ఇవ్వండి’
''ఆఫ్రికాలో కేవలం 7 శాతం మందే రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్నారు.''
''ఎంత లాభం వస్తే సరిపోతుంది? మీ దగ్గర సరిపడా ఉన్నాయి అని ఎప్పుడు అంటారు? మీరు సరిపడా లాభాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రాణాలు కాపాడటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.''
కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో ఎక్కడ తప్పు జరుగుతోంది?
''అన్ని అల్పాదాయ దేశాల్లోని ప్రజలు మొత్తంగా తీసుకున్న వ్యాక్సీన్ల కంటే.. ఎక్కువ వ్యాక్సీన్లను బూస్టర్ డోసుగా యూకేలో ఇస్తున్నారు'' అని ఆఫ్రికన్ అలయన్స్ అండ్ ద పీపుల్స్ వ్యాక్సీన్ అలయన్స్ ప్రతినిధి మాజా సెయోమ్ బీబీసీతో అన్నారు.
ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది.
ప్రపంచంలో అందరికీ సరిపడా వ్యాక్సీన్లు లేవా?
మార్చి వరకు ధనిక దేశాలు తమ దేశంలో అందరికీ బూస్టర్ డోసులు ఇచ్చుకుంటూ వెళ్లినా వంద కోట్ల డోసుల వ్యాక్సీన్లు అదనంగా ఉంటాయని ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరర్స్ అండ్ అసోసియేషన్ ప్రతినిధి థామస్ క్యూనీ బీబీసీతో చెప్పారు.
''కొన్ని వ్యాక్సీన్లే ఉన్నాయి అనే దగ్గర నుంచి సమస్య అన్ని వ్యాక్సీన్లు ధనిక దేశాలే తీసుకుంటున్నాయనే దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు సరిపడా వ్యాక్సీన్లు ఉన్నాయి. కానీ అందరికీ ఇవి చేరడం లేదు'' అని థామస్ క్యూనీ తెలిపారు.
వ్యాక్సీన్లు దానం చేస్తామని జీ7, ఈయూ దేశాలు మాట ఇచ్చాయి.
అయితే, ఇప్పటివరకు 14 శాతం వ్యాక్సీన్లే పేద దేశాలకు అందాయి.
''99 శాతం ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే వ్యాక్సీన్లపైనే ఆఫ్రికా ఆధారపడుతోంది. వ్యాక్సీన్ల దిగుమతిపైనే ఆధారపడుతోంది. దీని వల్లే వారికి సమస్య వస్తోంది'' అని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో ప్రొఫెసర్ దేవి శ్రీధర్ బీబీసీతో అన్నారు.
వ్యాక్సీన్ల ఉత్పత్తి భిన్న ప్రాంతాల్లో జరిగితే, ఆఫ్రికాకు కొంతవరకు మేలు జరగొచ్చని, అందుకు కాస్త సమయం పడుతుందని థామస్ క్యూనీ చెప్పారు.
అయితే, ఆ సమయం వచ్చిందని వ్యాక్సీన్ ప్రచారకర్తలు చెబుతున్నారు.
వ్యాక్సీన్ పేటెంట్లను ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.
''ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలలోనూ వ్యాక్సీన్లు ఉత్పత్తి చేసే సంస్థలున్నాయి. తయారీ ప్రక్రియలు తెలియజేస్తే, వ్యాక్సీన్ల ఉత్పత్తికి అవి సిద్ధంగా ఉన్నాయి'' అని మాజా సెయోమ్ వెల్లడించారు.

''లాభాలకు రక్షణ కల్పించేందుకే ఐపీ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ)లను ప్రవేశపెట్టారు.
దీని వల్ల విపరీతమైన లాభాలు వస్తాయని మనకు తెలుసు.
ప్రపంచం మొత్తాన్నీ పీడిస్తున్న వైరస్‌కు వ్యాక్సీన్ తయారు చేస్తే చాలా లాభాలు వస్తాయి'' అని దేవి శ్రీధర్ దేవి అభిప్రాయపడ్డారు.
వ్యాక్సీన్ల అభివృద్ధి చాలా ఖరీదైన ప్రక్రియని ఔషధ సంస్థలు చెబుతున్నాయి.
తమ పెట్టుబడులను సంరక్షించేందుకు పేటెంట్లు అవసరమని అంటున్నాయి.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
''ప్రస్తుతం 'ట్రిప్స్' రూపంలో ఒక మినహాయింపు ఉంది.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వద్ద ఈ మినహాయింపు ఉంది.
దీని సాయంతో మేధో సంపత్తి హక్కులను కాస్త సడలిస్తారు.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సీన్ల ఉత్పత్తికి అవకాశం వస్తుంది.
పేటెంట్ సంస్థల నుంచి ముడిసరకును తీసుకోవచ్చు'' అని మాజా సెయోమ్ చెప్పగా..
''కానీ, తయారుచేసే విధానం తెలియకపోతే ఎలా?
ఎలా తయారు చేయాలో తెలియకపోతే మీరు ఒక్క డోసు వ్యాక్సీన్ కూడా తయారు చేయలేరు.
కొత్త ఆవిష్కరణలకు వ్యాక్సీన్ పేటెంట్లు మూలం.
300 పార్ట్‌నర్‌షిప్‌లు, స్వచ్ఛంద లైసెన్సులు సాంకేతికత బదిలీలు లేకపోతే మనం నేడు ఇలా ఉండే వాళ్లం కాదు.
పేటెంట్ ఉండడమే దీనికి కారణం'' అని థామస్ క్యూనీ బదులిచ్చారు.
అయితే, ''హెచ్ఐవీ మహమ్మారి నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఈ మహమ్మారి నుంచి బయట పడేందుకు సాయం చేస్తాయి.
హెచ్ఐవీ మందుల కోసం ఫార్మా సంస్థలపై ఆఫ్రికా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
ఇప్పుడు మా దగ్గర ప్రపంచంలోనే విజయవంతమైన, భారీ హెచ్ఐవీ చికిత్సా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేం ఆ పోరాటంలో విజయం సాధించగలిగాం. మేం మళ్లీ అదే చేస్తాం. అదే మాలో ఆశలు నింపుతోంది'' అని ఆఫ్రికన్ అలయన్స్ అండ్ ద పీపుల్స్ వ్యాక్సీన్ అలయన్స్ ప్రతినిధి మాజా సెయోమ్ బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ప్రజల కష్టాలు: బియ్యం కోసం గాడ్జెట్లు, క్యాబేజీ కోసం సిగరెట్లు మార్పిడి
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాటు
- ఆధునిక చీర కట్టు ఏ రాష్ట్రానికి చెందినది?
- కర్మ అంటే ఏంటి? మనిషికి పునర్జన్మ నిజంగా ఉంటుందా? హిందూ మతం, బౌద్ధ మతం ఏం చెబుతున్నాయి?
- హైదరాబాద్‌లోనూ ‘బుల్లీ బాయి’ బాధితులు.. 67 ఏళ్ల ముస్లిం మహిళ ఫిర్యాదు
- చైనా మహిళలు గుండ్రని, పెద్ద కళ్ల కోసం సర్జరీలు చేయించుకుంటున్నారా
- ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌పై అత్యాచారం.. 1985 టూర్ సమయంలో జరిగిందని ఆరోపణ
- ఇమ్రాన్‌ఖాన్: ''అవినీతి, లైంగిక నేరాలే అసలైన సవాళ్లు''
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



