మొదటి ప్రపంచ యుద్ధం: అందమైన అమ్మాయిలా వేషం వేసుకుని తప్పించుకున్న జర్మనీ లెఫ్టినెంట్

బిగ్ బెన్

ఫొటో సోర్స్, Getty Images

మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక బందీగా చిక్కకుండా ఉండేందుకు ఓ జర్మనీ అధికారి అందమైన మహిళ వేషం వేసుకుని తప్పించుకు తిరిగారు.

లెఫ్టినెంట్ హెన్రిచ్ ఎర్నస్ట్ హీంజ్ యుద్ధ ఖైదీల శిబిరాల నుంచి రెండుసార్లు తప్పించుకున్నారు. ఒకానొక సమయంలో ఆయన లండన్‌లో నివసించారు.

అయితే, 1918 అక్టోబరులో కార్డిఫ్‌కు ఎందుకు వెళ్లారు?

చారిత్రక సమాచారం నేరుగా ఫోన్లలోనే తెలుసుకునేందుకు వీలుగా 'Historypoints.org' ఉంచిన వివరాలలో ఇది ఉంది.

ఈ కథనం లింకుకు తీసుకెళ్లే క్యూఆర్ కోడ్‌ను కార్డిఫ్ క్రౌన్ కోర్ట్ సమీపంలోని కేథేస్ పార్క్ పోలీస్ స్టేషన్ ల్యాంప్ పోస్ట్‌కి అతికించారు.

హీంజ్ కార్డిఫ్ వెళ్లినప్పటి విషయాలకు సంబంధించి అప్పట్లో చాలా ఊహాగానాలున్నాయి.

''జర్మన్‌లు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు వెస్టర్న్ మెయిల్‌లో వచ్చిన కథనాలు ఆయన్ను ప్రభావితం చేశాయన్న వాదన ఒకటి ఉంది' అని Historypoints.org ఎడిటర్ రోడ్రి క్లార్క్ అన్నారు.

ఇన్‌ఫ్లూయెంజాతో తీవ్రంగా బాధపడడం వల్ల కూడా లొంగిపోవడానికి వెళ్లి ఉండొచ్చన్న మరో వాదన ఉంది.

1918-1919లో యూరప్‌ను ఫ్లూ వణికించింది.

1915లో జర్మన్ యుద్ధ ఖైదీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1915లో జర్మన్ యుద్ధ ఖైదీలు

రెండోసారి ఆయన యార్క్‌షైర్ నగరంలోని ఒక శిబిరం నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత ఆయన లండన్‌లో ఒక అందమైన మహిళలా తిరిగారని చెబుతారు.

పురుషుడు అని గుర్తుపట్టడానికి వీల్లేనట్లుగా తనకు తానే వేషం వేసుకుని హీంజ్ తప్పించుకున్నారని అప్పటి వార్తాకథనాలు చెబుతున్నాయి.

1918లో అక్టోబరు 30న 'వెస్టర్న్ మెయిల్'లో వచ్చిన ఒక కథనం ప్రకారం.. అమాయకమైన, ఆకర్షణీయమైన ఒక అమ్మాయిలా లెఫ్టినెంట్ రూపం మార్చుకున్నారు.

అయితే, ఆ వీకెండ్‌లో ఆదివారం ఆయన లండన్ నుంచి కార్డిఫ్‌కు రైలులో వెళ్లారని వెస్టర్న్ మెయిల్ రాసింది.

అప్పుడాయన ఏంజెల్ హోటల్‌లో బస చేసినట్లు వెస్టర్న్ మెయిల్ తెలిపింది.

ఆయన్ను ఎవరూ అనుమానించలేదని.. ఎలాంటి ప్రశ్నలు వేయలేదని ఆ పత్రిక పేర్కొంది.

''ఇందులో మేం యుద్ధఖైదీలకు సంబంధించిన చాలా కథనాలు ఉంచాం'' అని క్లార్క్ చెప్పారు.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం నాటి ఎన్నో కథనాలు తెలుసుకోవడానికి ఈ కొత్త క్యూఆర్ కోడ్‌లు ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు క్లార్క్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)