ప్రపంచంలోనే అతిచిన్న బేబీ: పుట్టినప్పుడు యాపిల్‌ అంత బరువున్న ఈ పాప 13 నెలల తర్వాత ఇంటికి చేరింది

యూ షువాన్‌తో తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, NUH, SINGAPORE

ఫొటో క్యాప్షన్, యూ షువాన్‌తో తల్లిదండ్రులు

ప్రపంచంలోనే అతి చిన్న శిశువుగా చెబుతున్న ఒక పాప సింగపూర్‌లోని ఆస్పత్రిలో 13 నెలలు చికిత్స పొందిన తర్వాత చివరికి తల్లిదండ్రులతో కలిసి ఇంటికి చేరింది.

క్వెక్ యూ షువాన్ అనే ఈ చిన్నారి పుట్టినపుడు 212 గ్రాములు.. అంటే దాదాపు ఒక యాపిల్ అంత బరువుంది. అ సమయంలో పాప 24 సెంటీమీటర్ల పొడవుంది.

సాధారణంగా శిశువు 40 వారాల పాటు తల్లిగర్భంలో ఉండాల్సి ఉంటుంది.

కానీ ఈ శిశువు 25 వారాలకే జన్మించింది. అత్యంత చిన్న శిశువుగా రికార్డు సృష్టించింది.

ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికా పాప పేరిట ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఐయోవా 'అతిచిన్న శిశువుల రిజిస్ట్రీ'లో ఉంది. 2018లో జన్మించిన ఆ చిన్నారి పుట్టినపుడు 245 గ్రాముల బరువుంది.

యూ షువాన్

ఫొటో సోర్స్, KWEK FAMILY

ఫొటో క్యాప్షన్, పుట్టిన సమయంలో యూ షువాన్

యూ షువాన్ తల్లికి ప్రీ-ఎక్లంప్సియా ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో డాక్టర్లు నాలుగు నెలల ముందే ఆమెకు సిజేరియన్ చేసి పాపను బయటకుతీశారు.

ఆ వ్యాధి ఉన్న వారికి ప్రమాదకర స్థాయిలో ఉండే రక్తపోటు ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. గర్భం కొనసాగిస్తే తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడొచ్చు.

13 నెలల తర్వాత యూ షువాన్ ఇప్పుడు 6.3 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉంది.

పుట్టిన సమయంలో ఈ శిశువు బతికే అవకాశాలు చాలా తక్కువని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో డాక్టర్లు భావించారు.

పుట్టినప్పుడు ఎదురైన అన్ని ఆరోగ్య సమస్యలను అధిగమించి, నిలకడగా పెరిగిన ఈ శిశువు తన చుట్టూ ఉన్నవారికి ఒక స్ఫూర్తిగా నిలిచింది అని ఆస్పత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

13 నెలల పాటు ఆస్పత్రిలో

ఆస్పత్రిలో ఉన్నప్పుడు యూ షువాన్‌కు రకరకాల వైద్యం అందించారు. రకరకాల మెషిన్స్ ఉపయోగించి చిన్నారి ప్రాణాలు నిలిపారు.

తమ పర్యవేక్షణలో పాప ఆరోగ్యం మెరుగుపడిందని, ఇప్పుడు డిశ్చార్జ్ చేసేంత ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

కానీ, యూ షువాన్‌కు ఇంకా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ఉంది. ఇంట్లో పాపకు శ్వాస అందించాల్సి ఉంటుంది. అయితే చిన్నారి మెల్లమెల్లగా కోలుకుంటుందని భావిస్తున్నట్లు ఎన్‌యూహెచ్ డాక్టర్లు చెప్పారు.

యూ షువాన్ పుట్టినపుడు అంత చిన్నగా ఉండడం చూసి షాక్ అయ్యానని పాప తల్లి వాంగ్ మీ లింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. ఆమెకు మొదట బాబు పుట్టాడు. ఇప్పుడు అతడి వయసు నాలుగేళ్లు.

యూ షువాన్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు పాప తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 3,66,884 డాలర్లు(రూ.2.72 కోట్లకు పైనే) పోగుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)