కోవిడ్ నుంచి కోలుకున్నవారికి వాసన పీల్చడంలో శిక్షణ తీసుకోవడం అవసరమా?

వాసన

ఫొటో సోర్స్, Getty Images

కరోనా బారిన పడి వాసన కోల్పోయిన వారికి స్టెరాయిడ్లు ఇచ్చి చికిత్స చేసే బదులు వాసన గ్రహించడంలో శిక్షణ ఇవ్వడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఈ ప్రక్రియలో రకరకాల వాసనలను గుర్తించడానికి కొన్ని నెలల పాటు మెదడుకు శిక్షణ ఇస్తారు. రకరకాల వాసనలను ఈ ప్రక్రియలో ఉపయోగిస్తారు.

ఈ వాసన పీల్చే శిక్షణ తీసుకోవడం చాలా సులభం. దీనికి ఖర్చు కూడా తక్కువే అని కొంత మంది అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

స్టెరాయిడ్లలా మాదిరిగా దీని వల్ల దుష్ప్రభావాలేమి ఉండవు.

జ్వరం, దగ్గుతో పాటు వాసన కోల్పోవడం కూడా కరోనావైరస్ లక్షణాల్లో ఒకటి.

కోవిడ్ తగ్గగానే చాలా కేసుల్లో తిరిగి వాసన గ్రహించే శక్తి వచ్చేస్తుంది.

కానీ, ప్రతి ఐదుగురిలో ఒక్కరు కోవిడ్ తగ్గిన 8 వారాల తర్వాత కూడా వాసన తెలియడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.

దీనికి ఆస్తమాను తగ్గించడానికి వాడే కోర్టికోస్టెరాయిడ్ ద్వారా చేసే చికిత్సను డాక్టర్లు సూచిస్తున్నారు.

అయితే, కోల్పోయిన వాసన గ్రహించే శక్తిని తిరిగి తేవడానికి ఈ కోర్టికోస్టెరాయిడ్లు ఎంత వరకు పని చేస్తాయనడానికి చెప్పేందుకు తగినన్ని ఆధారాలు లేవని, అందుబాటులో ఉన్న ఆధారాలను సమీక్షిస్తున్న ప్రొఫెసర్ కార్ల్ ఫిల్ పాట్ చెప్పారు.

ఈ స్టెరాయిడ్ల వల్ల ఉండే దుష్ప్రభావాల వల్ల వీటిని కోల్పోయిన వాసన తిరిగి తెచ్చేందుకు చికిత్సగా ఇవ్వకూడదు అని ఆయన సూచించారు.

కోవిడ్-19 బారిన పడి వాసన కోల్పోయిన కొంత మందికి అదృష్టవశాత్తు త్వరగానే వాసనను పీల్చే శక్తి తిరిగి వస్తోంది.

స్టెరాయిడ్లు వాడటం వలన శరీరంలో నీరు నిల్వ ఉండిపోవడం, అధిక రక్త పోటు, ప్రవర్తనలో మార్పుల వల్ల సమస్యలు రావచ్చు.

ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ ఎలర్జీ అండ్ రైనాలజీ జర్నల్లో ప్రచురించిన ఒక పత్రంలో పరిశోధకులు స్టెరాయిడ్లకు బదులు వాసన పీల్చేందుకు శిక్షణ తీసుకోవడం మంచిదని సూచించారు.

smell

ఫొటో సోర్స్, Getty Images

ఇందులో సులభంగా గుర్తించగలిగే నాలుగు విభిన్నమైన, తెలిసిన వాసనలను పీల్చే ప్రక్రియ ఉంటుంది. ఉదాహరణకు నారింజ, పుదీనా, వెల్లుల్లి, కాఫీ లాంటి వాటి వాసనలను రోజుకు రెండు సార్లు కొన్ని నెలల పాటు పీలుస్తూ ఉండాలి.

ఇలా శిక్షణ తీసుకున్న వారిలో 90 శాతం మంది 6 నెలల్లో పూర్తిగా వాసనను తెలుసుకోగల్గుతున్నారని ప్రొఫెసర్ ఫిల్పాట్ చెప్పారు.

"ఒక వేళ వాసనను గ్రహించే శక్తి తిరిగి రాని పక్షంలో కనీసం కొన్ని దుర్గంధాలను గుర్తించగలిగేందుకు అయినా మెదడులో వాసనను కనిపెట్టగలిగే ద్వారాలు శిక్షణ పొందుతాయి", అని ఆయన చెప్పారు.

"ఏదైనా ఒక మార్పు జరిగినప్పుడు, గాయమైనప్పు స్వయంగా కుదురుకోవడానికి మెదడుకు ఉండే సామర్ధ్యం న్యూరోప్లాస్టిసిటీ పై ఆధారపడి ఉంటుంది. అందుకే, ఈ ప్రక్రియ కోలుకునేలా చేస్తుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)