ఆస్కార్ 2021: పది విభాగాల్లో 'మ్యాంక్' నామినేషన్లు.. జాబితా ప్రకటించిన ఆస్కార్ అకాడమీ

ఫొటో సోర్స్, NETFLIX/UNIVERSAL/AMAZON
ఈ ఏడాది ప్రకటించిన ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితాలో ఉత్తమ డైరెక్టర్ విభాగంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 93 సంవత్సరాల ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఇద్దరు మహిళలు ఈ అవార్డుకు ఒకేసారి నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి.
నొమాడ్‌ల్యాండ్ మూవీ దర్శకురాలు క్లో జావ్, ప్రామిసింగ్ యంగ్ విమన్ సినిమా దర్శకురాలు ఎమెరాల్డ్ ఫెన్నెల్.. ఒకేసారి నామినేషన్లు దక్కించుకుని ఈ చరిత్ర సృష్టించారు.
2021 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులకు నామినేషన్లను ఆస్కార్ అకాడమీ సోమవారం ప్రకటించింది.
బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించిన 'మ్యాంక్'.. మొత్తంగా 10 విభాగాలలో నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. గారీ ఓల్డ్‌మాన్ ఈ సినిమాలో సిటిజన్ కేన్ రచయిత హెర్మన్ మాంకెవిజ్ పాత్ర పోషించారు.
ఈ ఏడాది ఎనిమిది మంది బ్రిటిష్ నటీనటులు, సినీ కళాకారులు ఆస్కార్లకు నామినేట్ అయ్యారు. వారిలో సాచా బారన్ - కొహెన్, కేరి ముల్లిగన్, ఒలీవియా కోల్మన్, డేనియల్ కలూయా, సర్ ఆంథోని హాప్కిన్స్ ఉన్నారు.
ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల విజేతలను ఏప్రిల్ 25న ప్రకటిస్తారు.

ఫొటో సోర్స్, SEAN GLEASON/LIONSGATE
ప్రధాన నామినేషన్లు ఇవీ...
అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రాలు...
మ్యాంక్: 10 విభాగాల్లో నామినేషన్లు
ద ఫాదర్: 6 విభాగాల్లో నామినేషన్లు
జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య: 6 విభాగాల్లో నామినేషన్లు
నోమాడ్‌ల్యాండ్: 6 విభాగాల్లో నామినేషన్లు
సౌండ్ ఆఫ్ మెటల్: 6 విభాగాల్లో నామినేషన్లు
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7: 6 విభాగాల్లో నామినేషన్లు
ఉత్తమ చిత్రం కేటగిరీలో...
ది ఫాదర్
జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య
మ్యాంక్
మినారి
నోమాడ్‌ల్యాండ్
ప్రామిసింగ్ యంగ్ వుమన్
సౌండ్ ఆఫ్ మెటల్
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7
ఉత్తమ నటి విభాగంలో...
వయోల డేవిస్ (మా రేనీస్ బ్లాక్ బాటమ్)
ఆండ్రా డే (యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే)
వనేసా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఎ వుమన్)
ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (నోమాడ్‌ల్యాండ్)
కేరి ముల్లిగన్ (ప్రామిసింగ్ యంగ్ వుమన్)

ఫొటో సోర్స్, DAVID LEE/NETFLIX
ఉత్తమ నటుడు విభాగంలో...
రిజ్ అహ్మద్ (సౌండ్ ఆఫ్ మ్యూజిక్)
చాడ్విక్ బోస్మాన్ (మా రేనీస్ బ్లాక్ బాటమ్)
సర్ ఆంథోనీ హాప్కిన్స్ (ద ఫాదర్)
గేరీ ఓల్డ్‌మాన్ (మ్యాంక్)
స్టీవెన్ యూయెన్ (మినారి)
ఉత్తమ సహాయ నటి విభాగంలో...
మారియా బాకలోవా (బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీఫిల్మ్)
గ్లెన్ క్లోజ్ (హిల్‌బిల్లీ ఎలిజీ)
ఒలీవియా కోల్మన్ (ద ఫాదర్)
అమాండా సేఫ్రీడ్ (మ్యాంక్)
యూ జంగ్ యూన్ (మినారి)

ఫొటో సోర్స్, GLEN WILSON/WARNER BROS
ఉత్తమ సహాయ నటుడు విభాగంలో...
సాచా బారన్ కొహెన్ (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)
డానియల్ కలూయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య)
లెస్లీ ఓడామ్ జూనియర్ (ఒన్ నైట్ ఇన్ మియామి)
పాల్ రాసి (సౌండ్ ఆఫ్ మెటల్)
లకీత్ స్టాన్‌ఫీల్డ్ (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య)
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతోంది?
- మోదీ జాబ్ దో, మోదీ రోజ్‌గార్ దో... ట్విటర్‌లో మార్మోగిపోతున్న హ్యాష్‌ట్యాగులు
- పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మీ 'టేక్ హోమ్ సాలరీ' రాబోయే రోజుల్లో తగ్గిపోనుందా... ఎందుకని?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








