You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచంలోనే అత్యధికంగా మందుపాతరలు ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి
ఆఫ్రికా వాయువ్య తీరంలోని పశ్చిమ సహారా ప్రాంతంలో 50 ఏళ్లుగా సంఘర్షణ కొనసాగుతోంది.
దాదాపు 2,70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఎడారి ప్రాంతం ఇది. జనాభా చాలా తక్కువ.
ఒకప్పుడు స్పెయిన్ పాలనలో ఉన్నఈ ప్రాంతాన్ని 1975లో మొరాకో స్వాధీనం చేసుకుంది.
మొరాకో పాలనను వ్యతిరేకిస్తూ పోలిసారియో ఫ్రంట్ పోరాడుతోంది.
1991లో ఐరాస మధ్యవర్తిత్వం తర్వాత మొరాకో, పోలిసారియో మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి.
అయితే, 2020లో జరిగిన రెండు ఘటనలు మళ్లీ ఉద్రిక్తతలు పెరిగేలా చేశాయి. సరిహద్దుల్లో మొరాకో ఓ సైనిక పోస్ట్ పెట్టే చర్యలు చేపట్టింది. దీంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది.
మరోవైపు డిసెంబరులో అమెరికా అధ్యక్షుడు డోనల్ట్ ట్రంప్ పశ్చిమ సహారాపై మొరాకో అధికారాన్ని గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ సహారాలో ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరం దాదాపు వెయ్యి కిలోమీటర్ల పొడవున ఉంది.
ఈ ప్రాంతానికి ఉత్తారన మొరాకో, తూర్పున అల్జీరియా, దక్షిణాన మారిటేనియా ఉన్నాయి.
2.7 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఉండే జనాభా పది లక్షలు మాత్రమే. సహజ వనరులు మాత్రం మెండుగా ఉన్నాయి.
ఫాస్పేట్ నిక్షేపాలు ఇక్కడ విస్తారంగా ఉన్నాయి. చేపలు కూడా సమృద్ధిగా దొరుకుతాయి.
పశ్చిమ సహారాలో ప్రధానంగా బెర్బర్ జాతి వాళ్లు ఉండేవారు. 1884లో ఈ ప్రాంతం స్పెయిన్ నియంత్రణలోకి వెళ్లింది.
50 ఏళ్ల తర్వాత 1934లో స్పెయిన్ దీన్ని తమ ప్రాంతంగా గుర్తించింది. అప్పట్లో దీన్ని స్పానిష్ సహారా అని పిలిచేవారు.
అయితే 1965లో ఈ ప్రాంతంపై వలస పాలనను ముగించాలని అనుకుంటున్నట్లు స్పెయిన్ ఐరాసకు తెలియజేసింది. మరోవైపు పక్కనే ఉన్న మొరాకో రాజ్యానికి కూడా స్వాతంత్ర్యం వచ్చింది.
ఆ తర్వాత పశ్చిమ సహారాను తమ ప్రాంతమని మొరాకో బలంగా వాదిస్తూ వచ్చింది. మొరాకోతోపాటు మారిటేనియా కూడా ఈ ప్రాంతం తమదని వాదిస్తూ ఉంది.
అదే సమయంలో పశ్చిమ సహారాలో స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు మొదలయ్యాయి. 1973లో ఈ పోరాటం కోసం పోలిసారియో ఫ్రంట్ ఏర్పడింది.
సహారా ప్రజలకు స్వాతంత్ర్యం ఇస్తామని, స్వాతంత్ర్యం విషయమై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని స్పెయిన్ 1974లో ప్రకటించింది.
కానీ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండానే 1975లో స్పెయిన్ పశ్చిమ సహారాను విడిచిపెట్టింది. అదే సమయంలో ఈ ప్రాంతాన్ని మొరాకో ఆక్రమించింది.
మొరాకో తమ దేశ ప్రజలను ఈ ప్రాంతంలోకి తీసుకురావడంపై కూడా దృష్టి పెట్టింది.
1975 నవంబర్‌లో మొరాకో నుంచి మూడున్నర లక్షల మంది పశ్చిమ సహారా ప్రాంతంలోకి వచ్చారు.
అప్పుడు పోలిసారియో ఫ్రంట్ మొరాకోకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం మొదలుపెట్టింది. ఆ తర్వాత 16 ఏళ్లపాటు ఆ పోరాటం కొనసాగింది.
అల్జీరియా మద్దతుతో పోలిసారియో ఫ్రంట్ పశ్చిమ సహారాను సహారావీ అరబ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ (ఎస్‌ఏడీఆర్)గా ప్రకటించుకుంది. పశ్చిమ సహారా తమ ప్రాంతమన్న వాదనను 1979లో మారిటేనియా వదిలిపెట్టింది.
మొరాకోకు వ్యతిరేకంగా మొదలైన పోలిసారియో ఫ్రంట్ ఆరంభంలో విజయాలు సాధించింది. అయితే, ఆ తర్వాత లోపలి ప్రాంతాల వైపు ఫ్రంట్ పారిపోవాల్సి వచ్చింది.
మొరాకో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో గెరిల్లా పోరాటకారులను నిలువరించేందుకు 1980వ దశకంలో రాతి, మట్టి గోడలు నిర్మించింది.
పశ్చిమ సహారాలోని 80 శాతం ప్రాంతం మొరాకో నియంత్రణలో ఉంది. దీన్ని తమ పరిధిలోకి తెచ్చుకునేలా 2,700 కి.మీ.ల పొడవైన గోడను నిర్మించింది మొరాకో.
ఈ గోడ ప్రాంతమంతా కంచెలు, ల్యాండ్ మైన్లతో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ల్యాండ్ మైన్లు ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.
ప్రస్తుతం ఎస్ఏడీఆర్ నియంత్రణలో పశ్చిమ సహారాలోని మిగతా 20 శాతం ప్రాంతం ఉంది. ఇది కూడా ఎడారి ప్రాంతమే.
1991లో రెండు పక్షాల మధ్యలో ఒప్పందం కుదిరేవరకూ ఈ సంఘర్షణ కొనసాగింది.
స్వతంత్ర దేశంగా ఉండాలా? మొరాకోతో కలవాలా? అనే విషయమై ఐరాస ద్వారా జనాభిప్రాయ సేకరణ నిర్వహించాలని వీరి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఇప్పటివరకూ ఇది సాధ్యం కాలేదు.
గత ఏడాది నవంబరులో మొరాకో సైన్యం ఓ సరిహద్దు పోస్టును దాటి వెళ్లడంతో మళ్లీ యుద్ధ వాతావరణం ఏర్పడింది.
ఒప్పందాన్ని మొరాకో ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తూ పోలిసారియో ఫ్రంట్ ఈ ప్రాంతంలో యుద్ధాన్ని ప్రకటించింది.
మొరాకో సైన్యంపై తాము దాడి చేశామని, వారి సైనికులకు నష్టం కలిగించామని పోలిసారియో ఫ్రంట్ ప్రకటించింది. మొరాకో మాత్రం దీన్ని తోసిపుచ్చింది.
పోలిసారియో ఫ్రంట్, మొరాకో రెండూ వివాదాస్పద ప్రాంతంలోకి బయట వారు రాకుండా నిషేధం విధించాయి. దీంతో అక్కడేం జరుగుతుందో ధ్రువీకరించే పరిస్థితి లేకపోయింది.
ఈ వివాదం వల్ల మొరాకో, అల్జీరియా మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. అల్జీరియా, మొరాకో మధ్య ఉన్న సరిహద్దులను 1994లో మూసేశారు.
అల్జీరియాలోని ఎడారి పట్టణమైన టిండోఫ్ పట్టణంలోని లక్షకుపైగా మంది సహారావీ శరణార్థులు జీవిస్తున్నారు.
80కిపైగా దేశాలు ఏఎస్‌డీఆర్‌ను అధికారికంగా గుర్తించాయి. వీటిలో లాటిన్ అమెరికా దేశాలు కూడా ఉన్నాయి.
ఐరాస పశ్చిమ సహారాను స్వయం ప్రతిపత్తి లేని ప్రాంతంగా పరిగణిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అక్కడి వారికి భవితవ్యాన్ని నిర్ణయించుకునే హక్కు ఉన్నట్లు గుర్తించింది.
కొద్దికాలం కిందట పశ్చిమ సహారాను మొరాకో ప్రాంతంగా గుర్తిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్, మొరాకోల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది.
అయితే అమెరికా నిర్ణయం వల్ల క్షేత్ర స్థాయి పరిస్థితులపై పెద్దగా ప్రభావం ఉండదని బీబీసీ ఉత్తర ఆఫ్రికా ప్రతినిధి రానా జావేద్ అన్నారు.
ట్రంప్ నిర్ణయాన్ని ఎస్ఏడీఆర్, పోలిసారియో ఫ్రంట్ వ్యతిరేకించాయి.
మరోవైపు ఫ్రాన్స్ కూడా పశ్చిమ సహారాపై మొరాకో అధికారాన్ని గుర్తిస్తోంది.
ఐరాస భద్రత మండలిలో ఫ్రాన్స్, అమెరికా రెండు శాశ్వత సభ్య దేశాలు. ఈ రెండింటికీ వీటో అధికారం ఉంది.
అయితే, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఇప్పటికీ పశ్చిమ సహారా వివాదాన్ని పరిష్కరించవచ్చని భావిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అంటున్నారు.
''పశ్చిమ సహారా స్వతంత్ర దేశంగా ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి'' అని రానా జావెద్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)