You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనలపై విమర్శలెందుకు? అసలు విషయమేంటి?
'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' తరహాలో రాజధాని అమరావతిలోని నీరుకొండ గ్రామంలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌పై అందరికీ గౌరవం ఉందని, కానీ కూటమి ప్రభుత్వం ఆయన విగ్రహం పేరిట రూ.1,750 కోట్లు ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ వ్యవహారమేంటి? విమర్శలు ఎందుకు?
వీడియో, సంక్రాంతి సందడి: ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ రేస్..., వ్యవధి 1,30
సంక్రాంతి సందర్భంగా ఆంధప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ రేస్ నిర్వహించారు.
'భారత్‌పై దాడికి వాడిన ఎయిర్‌క్రాఫ్ట్'లను అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్
జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్ల విక్రయ ప్రయత్నాలను పాకిస్తాన్ మంత్రి ధ్రువీకరించారు. "ఇవి రహస్యంగా ఉంచాల్సిన విషయాలు, నేను ఏ దేశం పేరూ చెప్పలేను. వారితో మేం ఏ స్థాయిలో చర్చలు జరుపుతున్నామో చెప్పలేను" అన్నారు మంత్రి రజా హయత్ హరాజ్.
'బ్రేకప్ తర్వాత ఏ అమ్మాయైనా మందు తాగేసి, గడ్డం పెంచుకుందా చారూ' అంటూ నవీన్ పొలిశెట్టి చేసిన అల్లరి అలరించిందా?
డైలాగ్‌లు సినిమాకి ముఖ్యమైన బలం. 'విమానం కనిపెట్టింది ఆర్ఎస్ బ్రదర్స్' అని హీరోయిన్ అంటే 'కాదు, రాంగ్ బ్రదర్స్' అని హీరో అంటాడు. అఫెక్షన్ అంటే తెలుగులో ఆస్తులు అని అర్థం వంటి డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని నవీన్ ఆకట్టుకుంటాడు.
''పోరాడండి, మీకు సాయం వస్తోంది''- ఇరాన్ నిరసనకారులకు ట్రంప్ భరోసా
ఇరాన్‌పై సైనిక, ఇతర చర్యలను ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ఇప్పటికే 25 శాతం సుంకాన్ని ప్రకటించారాయన.
తెలంగాణ: మీ ఇంట్లో పాత టీవీని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు, ఎలాగంటే...?
సొంతంగా కంప్యూటర్ కొనుక్కోలేని విద్యార్థులు తమ ఇళ్లల్లోని సాధారణ టీవీలనే బేసిక్ కంప్యూటర్‌గా మార్చుకునే అవకాశం కల్పించనున్నట్లు టీ-ఫైబర్ సంస్థ చెబుతోంది. మొదటగా తెలంగాణలోని 6 ఉమ్మడి జిల్లాల్లో ఈ సౌకర్యం కల్పించబోతున్నట్టు తెలిపింది. ఈ విధానం ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది.
థాయ్‌లాండ్: కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, ప్రమాద తీవ్రతను చూపే 8 ఫోటోలు..
థాయిలాండ్‌లో నిర్మాణ ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. భద్రతా నియమాలు సరిగా అమలు చేయకపోవడం దీనికి కొంత కారణం.
పూడిమడకలో లక్షలకోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ హబ్...ఏడాది తర్వాత ఏ స్థితిలో ఉంది?- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
ఏపీకి మహర్దశ, విశాఖకు ఉజ్వల భవిత, గేమ్ చేంజర్ ప్రాజెక్ట్, ఏపీ భవిష్యత్ ఇంధన రూపురేఖలను మార్చగలిగే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు అంటూ అనేక కథనాలు వచ్చి ఏడాది పూర్తయింది.
సంక్రాంతి తేదీ మారుతూ ఉంటుంది, ఎందుకు?
భూమి 23.5 డిగ్రీల కోణం వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుండటం వల్ల కొన్ని నిర్ధిష్ట సమయాలకి ఉత్తర భాగం సూర్యునికి దగ్గరగా ఉంటుంది. మరికొన్నిసార్లు దక్షిణభాగం సూర్యుని సమీపానికి వస్తుంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.