టాంజానైట్ రాళ్లతో రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన వ్యాపారికి మరో అరుదైన రత్నం దొరికింది...

ఫొటో సోర్స్, Tbc1
అరుదైన టాంజానైట్ శిలలు దొరికి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన వ్యాపారికి మరో అరుదైన రత్నం దొరికింది. దీంతో మరోసారి ఆయన పంట పండింది.
టాంజానియాలో ఒక చిన్న ఖనిజ వ్యాపారికి జూన్‌లో రెండు అరుదైన టాంజానైట్ శిలలు దొరికాయి. వాటి ధర 34 లక్షల డాలర్లు(సుమారు రూ. 25.5 కోట్లు).
వాటిని అమ్ముకుని ఆయన రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆయనకు మరో అరుదైన రత్నం దొరికింది. దీన్ని 20 లక్షల డాలర్లు(సుమారు కోటిన్నర రూపాయలు)కు విక్రయించారు.

సానినీ లేజర్ టాంజానియాలో చిన్నపాటి గనుల వ్యాపారి. అతనికి దొరికిన ఈ మూడో అరుదైన రత్నం బరువు 6.3 కేజీలు.
టాంజానైట్ అనే ఈ విలువైన శిల ఉత్తర టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. దీన్ని ఆభరణాల తయారీలో వాడతారు.
ఇది భూమిపై దొరికే అరుదైన రత్నాలలో ఒకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ శిలలు బాగా తగ్గిపోతాయని స్థానిక భూగర్భ శాస్త్రవేత్త ఒకరు అంచనా వేస్తున్నారు.
ఈ విలువైన రత్నం అనేక రంగుల్లో దొరుకుతుంది. ఇదే దీని ప్రత్యేకత. ఆకుపచ్చ, ఎరుపు, ఊదారంగు, నీలం రంగుల్లో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ గనుల తవ్వకంలో ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయడం లాభదాయకమని.. అందుకు తానే ఒక ఉదాహరణ అని లైజర్ మిగతా చిన్న ఖనిజ వ్యాపారులకు సూచించారు.

ఫొటో సోర్స్, TANZANIA MINISTRY OF MINERALS
"ప్రభుత్వానికి అమ్మడం అంటే సరైన దారిలో వెళ్లడం. లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి" అని ఆయన అన్నారు.
ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే ప్రతిఫలం ఆలస్యంగా చేతికి వస్తుందని, గతంలో దీని గురించి ఫిర్యాదులు ఉన్నాయని బీబీసీ ప్రతినిధి అబౌబాకర్ ఫమాయూ తెలిపారు.
జూన్‌లో రెండు టాంజానైట్ శిలలు అమ్మిన తరువాత అందరికీ పెద్ద పార్టీ ఇస్తానని 30 మంది పిల్లల తండ్రి అయిన లేజర్ చెప్పారు.
అయితే తనకు వచ్చిన డబ్బుతో ఉత్తర మన్యారా ప్రాంతంలోని సిమాంజిరో రాష్ట్రంలో తన కమ్యూనిటీలోని పిల్లలకోసం స్కూలు, ఆరోగ్య వసతులు నిర్మిస్తానని సోమవారం ఆయన ప్రకటించారు.
ఇప్పుడు తను ధనవంతుడైపోయినంత మాత్రాన తన జీవన విధానం ఏం మారిపోదని ఎప్పటిలాగే తన దగ్గరున్న 2,000 ఆవుల పాలన, పోషణ చూసుకుంటానని లేజర్ అన్నారు.
లేజర్ లాంటి చిన్న వ్యాపారులు ప్రభుత్వ లైసెన్సుతో గనుల తవ్వకాలు చేస్తారు గానీ ఈ అరుదైన శిలలు లభించే గనుల చూట్టూ పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతాయి. ఇందులో పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యం ఉంటుంది.
ఈ అరుదైన టాంజానైట్ శిల దొరికే మన్యారా రాష్ట్రంలోని మెరెలాని గని చుట్టూ 24 కిలోమీటర్ల పొడవైన గోడ కట్టమని 2017లో టాంజానియా దేశాధ్యక్షుడు మగుఫులి సైన్యాన్ని ఆదేశించారు.
ఈ గోడ కట్టిన ఒక ఏడాది తరువాత మైనింగ్ రంగంలో ఆదాయం పెరిగిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..!
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- క్రిస్మస్: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య పేరు ‘అధికారికంగా’ కనిపించదెందుకు?
- కరోనావైరస్ మృతులను జేసీబీలతో ఎందుకు ఖననం చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








