సూర్యగ్రహణం: వివిధ దేశాల్లో నెలవంకలా మారిన సూర్యుడి చిత్రాలు

ఫొటో సోర్స్, Reuters
ఈ గ్రహణాన్ని కొంత మంది ఫొటోగ్రాఫర్లు తమ కెమెరా లలో బంధించారు. ఈ ఖగోళ అద్భుతం సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడటం వలన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ గా పిలుస్తారు. కొంత సమయం పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా చీకటి కమ్మేస్తుంది.
ఈ గ్రహణం, ఉత్తర భూభాగంలో సుదీర్ఘ పగలు కనిపించే రోజే రావడం యాదృచ్చికం.
ప్రతీ ఏటా ఒకటి గాని, రెండు గాని గ్రహణాలు ఏర్పడటం సహజం. అయితే అవి భూమి మీద కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. దీనినే సెంటర్ లైన్ అని అంటారు. ఆదివారం ఏర్పడిన సూర్య గ్రహణం ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు 90 సెకండ్ల కంటే కొంత తక్కువ సమయం పాటు నిలిచి ఉంది.
ఈ సెంటర్ లైన్ కి దూరంగా నివసించే ప్రజలు అసలైన గ్రహణాన్ని వీక్షించలేక పోయారు. కానీ, కొన్ని ప్రాంతాలలో చీకటి కమ్మడాన్ని చూసారు.
500 మెగా వాట్ల విద్యుత్ బల్బ్ ని ఆపేసి 30 వాట్ల విద్యుత్ బల్బ్ వెలిగిస్తే కాంతి ఎలా ఉంటుందో, ఈ గ్రహణాన్ని వీక్షించడం కూడా అలాగే ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు.
ప్రపంచంలోన పలు దేశాల్లో సూర్యగ్రహణం చిత్రాలు:
ముంబయి, ఇండియా

ఫొటో సోర్స్, EPA
గ్వాంగ్‌జో, చైనా

ఫొటో సోర్స్, EPA
మనీలా , ఫిలిప్పీన్స్

ఫొటో సోర్స్, AFP
చియాయి, తైవాన్

ఫొటో సోర్స్, EPA
కరాచీ, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Reuters
ఆదివారం నాటి సూర్యగ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా తిలకించారు. ఆ దృశ్యాల అందమైన సమాహారం ఇది.
ఇవి కూడా చదవండి:
- ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ
- అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?
- భారత్ - చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.... సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు చర్యలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- చైనా మీద భారత్ విరుచుకుపడిన 1967 నాథూలా యుద్ధం గురించి తెలుసా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనావైరస్ ఇటలీలో గత ఏడాది డిసెంబర్ నాటికే ఉందని తేల్చి చెబుతున్న మురుగు నీటి పరిశోధనలు
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








