కరోనావైరస్: హాంకాంగ్‌లో టాయిలెట్ రోల్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూలు కడుతున్న జనం

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ దెబ్బకు హాంకాంగ్‌లో టాయిలెట్ పేపర్లకు కూడా కరవొచ్చి పడింది. దీంతో వాటికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు ఓ సూపర్ మార్కెట్ దగ్గర సరుకు దించుతుండగా ఆయుధాలతో పనివాళ్లను బెదిరించి మరి వందలాది టాయిలెట్ రోల్స్‌ను ఎత్తుకెళ్లారని మాంగ్‌కాక్ జిల్లా పోలీసులు చెప్పారు.
దొంగతనం జరిగిన రోల్స్ విలువ సుమారు పదిహేను వేల రూపాయలకుపైగా ఉంటుందని స్థానిక మీడియా యాపిల్ డైలీ వెల్లడించింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. వారి నుంచి కొన్ని రోల్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



ఫొటో సోర్స్, Getty Images
టాయిలెట్ రోల్స్ కోసం సూపర్ మార్కెట్ల వద్ద భారీ క్యూలు
నిజానికి కరోనా వైరస్ భయంతో దేశ వ్యాప్తంగా నిత్యావసరాలైన బియ్యం, పాస్తా సహా నిత్యావసరాలకు, టాయిలెట్ శుభ్రపరిచే వస్తువులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. దీంతో అన్ని సూపర్ మార్కెట్ల వద్ద వాటి కోసం జనం భారీగా క్యూలు కడుతున్నారు.
ఓవైపు ప్రభుత్వం కరోనావైరస్ భయం లేదని చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం వైరస్ భయంతో ముందు జాగ్రత్తగా ఇళ్లల్లో పెద్ద ఎత్తున టాయిలెట్ పేపర్లను నిలువ చేసుకుంటున్నారు. ముఖానికి తగిలించుకునే మాస్కులు, శానిటైజర్లు దొరకడం హాంకాంగ్‌లో గగనమైపోతోంది.
మరోవైపు నిత్యావసరాల కొరత ఏర్పడిందంటూ ఆన్‌లైన్లో జరుగుతున్న ప్రచారాన్ని హాంకాంగ్ ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. అటు సింగపూర్‌లో కరోనావైరస్ భయంతో కూడా టాయిలెట్ రోల్స్, శానిటైజర్లు, పేస్ మాస్క్‌ల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో అక్కడ కూడా వాటి కొరత తీవ్రంగానే ఉంది.

ఇవి కూడా చదవండి
- మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు
- "ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?
- హిమాలయాలపై భారీగా చెత్త, శవాలు... శుభ్రత బాధ్యతను ఆర్మీకి ఇవ్వడంపై అభ్యంతరాలు
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: వుహాన్ వాసులకు భోజనం ఎలా అందుతోంది
- కరోనావైరస్ పశ్చిమ బెంగాల్‌లోని ఈ పల్లెపై ఎలాంటి ప్రభావం చూపించింది
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





