కరోనావైరస్: మాస్కో రైలు ప్రయాణికులను హడలెత్తించిన ప్రాంక్‌స్టర్

మాస్క్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ బాధితుడిలా నటించి రష్కాలోని మాస్కోలోని ఓ రైలులో హఠాత్తుగా కిందపడిపోయిన ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. కదులుతున్న ఓ రైలులో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తూలిపోతూ కిందపడిపోగా సాటి ప్రయాణికులు ఆయనకు సహాయపడేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది.

ఆ వెంటనే ఆయన గిలగిలా కొట్టుకోవడంతో సహాయపడుతున్నవారు, అక్కడ సీట్లలో కూర్చున్నవారు కూడా భయంతో పారిపోవడం కనిపిస్తుంది.

కాగా నేరపూరితంగా తుంటరితనంతో రైలు ప్రయాణికులను భయపెట్టారన్న కారణంతో ఆ తుంటరిని మాస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోషిగా తేలితే ఆ ప్రాంక్‌స్టర్‌కు అయిదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అడ్డగీత
News image
అడ్డగీత

ఆ ప్రాంక్‌స్టర్‌ను అరెస్టు చేసినట్లు రష్యా అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి సోమవారం తెలిపారు. ప్రాంక్‌స్టర్ కిందపడి గిలగిలా కొట్టుకుంటుంటే కరోనావైరస్ బాధితుడంటూ అరిచిన మరో ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.

''ఆయనతో ఉన్నవారు ప్రయాణికుల్లో భయం కలిగించేలా అతడికి ప్రమాదకర వైరస్ సోకిందని అన్నారు'' అంటూ రష్యా ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి ఇరినా వోక్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రష్యాకు చెందిన వెస్టి న్యూస్ వెబ్‌సైట్ ప్రాంక్‌స్టర్ రైలులో చేసిన పనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది.

మొదట ఫిబ్రవరి 2నే కారా.ప్రాంక్ అనే వెబ్‌సైట్‌లో ఈ వీడియో పబ్లిష్ అయినప్పటికీ తరువాత దాన్ని తొలగించారు.

ప్రాంక్‌స్టర్ తరఫున ఆయన లాయర్ మాట్లాడుతూ.. ''నా క్లయింట్ షాక్ తిన్నారు. ప్రాంక్ తరువాత ఆయనేమీ దాక్కోలేదు. ఇలా అరెస్ట్ చేస్తారని ఊహించలేదు. విచారణ జరుపుతున్న అధికారి కూడా కేసు కొట్టేయొచ్చేమోనని అన్నారు'' అని చెప్పారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)