చైనాలోని ముస్లిం శిబిరాలపై ఓ యువతి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్

ఫొటో సోర్స్, Tiktok
- రచయిత, లియో కెలియన్
- హోదా, టెక్నాలజీ డెస్క్ ఎడిటర్
అమెరికా టీనేజర్ చేసిన టిక్‌టాక్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ చేసిన ఈ టిక్‌టాక్ వీడియో ఇప్పుడు అక్కడ వైరల్‌గా మారింది.
ఫిరోజా అజీజ్ అనే యువతి ఈ వీడియో ప్రారంభంలో సౌందర్య చిట్కాలు చెబుతుంది. ఆ వెంటనే చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని.. అది మరో వినాశనమని చెబుతూ, ప్రజల్లో ఈ సమస్యపై చైతన్యం తేవాలంటూ వీక్షకులను కోరుతుంది.
ఈ వీడియో చేసిన తరువాత టిక్‌టాక్ తనను బ్యాన్ చేసిందని.. ఇప్పుడు ఇంకే వీడియోలూ పోస్ట్ చేయలేకపోతున్నానని ఫిరోజా అజీజ్ ట్వీట్ చేసింది.
కానీ, టిక్‌టాక్ మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. ''టిక్ టాక్ రాజకీయంగా సున్నితమైన కామెంట్లనేమీ మోడరేట్ చేయదు'' అని టిక్ టాక్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.
చైనాలో టిక్‌టాక్ యాప్ డౌయీన్ పేరుతో ఉంటుంది.. ఫిరోజా వీడియోలు ఇప్పుడు అందులో కనిపించడం లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫిరోజా పాత టిక్‌టాక్ అకౌంట్‌ను ఒకదాన్ని నవంబరు 15న ఆ సంస్థ బ్లాక్ చేసింది. ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారంతో రూపొందించిన వీడియో పోస్ట్ చేశారన్న కారణంతో ఆ ఖాతాను నిలిపివేశారు.
ఆ తరువాత ఆమె స్మార్ట్‌ఫోన్‌ను నవంబరు 25న బ్లాక్ చేశారు.
ఆమె కొత్త ఖాతా కానీ, అందులో పోస్ట్ చేసిన తాజా వీడియోలపై కానీ ఎలాంటి నియంత్రణా లేదని.. ఆమె కొత్త వీడియోను వీక్షకులు చూస్తున్నారని టిక్‌టాక్ అధికార ప్రతినిధి చెప్పారు.
దీనిపై బీబీసీ ఫిరోజా అజీజ్, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించింది.
మరోవైపు చైనా ప్రభుత్వం ఈ కాన్సంట్రేషన్ క్యాంపులను విద్య, శిక్షణ కేంద్రాలుగా చెబుతోంది. ఫిరోజా ఆది, సోమవారాల్లో చైనా ప్రభుత్వం వీగర్ ముస్లింల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై మూడు వీడియోలు పోస్ట్ చేశారు.
అందులో మొదటి వీడియోను 14 లక్షల మంది చూశారు. ఆ వీడియోను 5 లక్షల మంది లైక్ చేశారు.
అదే వీడియోను ఇతర టిక్‌టాక్ యూజర్లు ట్విటర్‌లో పోస్ట్ చేయగా అక్కడ సుమారు మరో 50 లక్షల మంది చూశారు.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఫొటో సోర్స్, Reuters
చైనా ప్రధాన ప్రాంతంలో వినియోగంలో ఉన్న టిక్‌టాక్ స్థానిక వెర్షన్ యాప్‌లో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై విమర్శలను సెన్సార్ చేస్తుందని.. ఇతర ప్రాంతాల్లో యూజర్ జనరేటెడ్ కంటెంట్ విషయంలో అదే విధంగా వ్యవహరించకపోవచ్చని చెబుతున్నారు.
జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపులలో ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నది కొన్ని లీకైన డాక్యుమెంట్ల ఆధారంగా బీబీసీ పనోరమాలో వచ్చిన కొద్దిరోజులకే పదిహేడేళ్ల ఫిరోజా వీడియో కూడా వచ్చింది.
ఫిరోజా వీడియోలో ఈ డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా ఆమె సొంతంగా కొన్ని ఆరోపణలు చేశారు.
చైతన్యం కలిగిస్తే అద్భుతాలు చేయవచ్చని ఆమె అంటున్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని చేరుకోవచ్చు, వారిలో కొందరికి వీటి గురించి ఏదైనా చేయగల సామర్థ్యం కూడా ఉండవచ్చని ఫిరోజా అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ‘తమిళనాడులో టిక్‌టాక్’ యాప్‌ను నిషేధించాలని నిర్ణయం’
- వర్చువల్ రియాలిటీకి ఆగ్మెంటెడ్ రియాలిటీకి తేడా ఏంటంటే...
- మహారాష్ట్ర: ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రే ఎన్నిక...
- 'రాజుల కోట' నుంచి అమూల్యమైన వజ్రాలను ఎత్తుకెళ్లిన దొంగలు
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్‌వాష్' చేస్తున్న చైనా
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








