మలేరియా: లక్షల మందిని బలితీసుకుంటున్న ఈ ప్రాణాంతక పరాన్నజీవి మనిషికి ఎలా సంక్రమించిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
గొరిల్లాలోని ఓ ప్రాణాంతక తరహా మలేరియా వైరస్.. అరుదైన, దురదృష్టకర సంఘటనల కారణంగా ఇతరు జాతులను వదిలిపెట్టి మనిషి మీద దాడిచేసిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రతి ఏటా లక్షలాది మంది ప్రజలు మలేరియా వల్ల చనిపోతున్నారు. అందులో అత్యధిక మరణాలకు కారణం.. ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనే వైరస్. ఈ వైరస్ మీద పరిశోధకులు అధ్యయనం చేశారు.
ఈ పరాన్నజీవి అసలు నివాసం ఆఫ్రికా గొరిల్లాలు.
కానీ.. దాదాపు 50,000 సంవత్సరాల కిందట యాధృచ్ఛికంగా జరిగిన జన్యుపరివర్తనం వల్ల ఆ వైరస్ మనుషులకు ప్రమాదకరంగా మారిందని నిపుణులు కనుగొన్నారు.
దోమ కాట్లు
మలేరియా మీద పోరాటానికి కొత్త మార్గాలను కనుగొనటానికి ఈ అధ్యయనం దోహదపడగలదని వెల్‌కమ్ సాంగర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఆశిస్తున్నారు. అధ్యయనంలో గుర్తించిన అంశాలను ప్లాస్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు.
మలేరియా సోకిన దోమ మనుషులను కానీ, జంతువులను కానీ కుట్టినపుడు ఆ వైరస్ సదరు జీవి రక్తప్రవాహంలోకి చేరుతుంది. దీంతో మలేరియా వ్యాధి వస్తుంది.
ఇందులో అనేక రకాల వైరస్‌లు ఉన్నాయి. కానీ.. ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ రకం వైరస్ ఇప్పుడు కేవలం మనుషుల మీదే ప్రభావం చూపుతుంది.
మానవులు ఆఫ్రికా నుంచి తొలిసారి బయటకు వలస వచ్చిన సమయంలోనే.. అంటే దాదాపు 40,000 నుంచి 60,000 సంవత్సరాల కిందటే ఈ రకం వైరస్ నివాసం గొరిల్లాల నుంచి మనుషులకు మారిందని పరిశోధకులు చెప్తున్నారు.
మలేరియా పరాన్నజీవికి చెందిన విభిన్న పూర్వ రకాల జన్యుపటాలను వారు అధ్యయనం చేశారు. ముఖ్యంగా ఆర్‌హెచ్5 అని పిలిచే నిర్దిష్ట జన్యువుపై పరిశోధనను కేంద్రీకరించారు. ఈ మలేరియా మనిషిలోని ఎర్ర రక్తకణాలకు సోకటానికి వైరస్‌లోని ఈ జన్యువే కారణం.

ఫొటో సోర్స్, Getty Images
సరికొత్త మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటానికి వైద్యులు ఈ జన్యువును లక్ష్యంగా చేసుకున్నారు.
వేలాది సంవత్సరాల కిందట ఒక గొరిల్లాకు రెండు రకాల మలేరియా పరాన్నజీవులు సోకాయని.. ఆ రెండు రకాల మలేరియాల మధ్య జన్యుమార్పిడి జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు.
అలా ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ ఆర్‌హెచ్5 జన్యువును తీసుకుంది.
''ఈ అరుదైన సంఘటన.. మానవుల్లో మలేరియా వ్యాధి ప్రబలి కోట్ల మంది చనిపోవటానికి కారణమైంది'' అని ఈ అధ్యయన సారథి డాక్టర్ గావిన్ రైట్ పేర్కొన్నారు.
''ఆర్‌హెచ్5 జన్యువు చాలా ముఖ్యం. దీని గురించి ఎంత ఎక్కువ వివరాలు తెలిస్తే.. మలేరియా వ్యాధి మీద పోరాటానికి అంత సాయపడుతుంది'' అని చెప్పారు.
ఈ పరాన్నజీవి మళ్లీ త్వరగా జన్యుపరివర్తనం చెందటం సైద్ధాంతికంగా సాధ్యమే అయినా.. అలా జరిగే అవకాశాలు 'చాలా చాలా తక్కువ'గా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి మలేరియా ముప్పు పొంచివుంటుంది. అత్యధిక కేసులు, మరణాలు.. ఆఫ్రికాలోని సహారా దిగువన గల దేశాల్లో చిన్నపిల్లల్లో సంభవిస్తుంటాయి. ఆ మలేరియాకు కారణం.. ప్లాస్మోడియం ఫాల్సిపారమ్.
ఇవి కూడా చదవండి
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధంతో లాభమా, నష్టమా... అసలు వైఎస్ జగన్ హామీ అమలు సాధ్యమేనా?
- రోహిత్ శర్మ IND vs. SA: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








