అమెరికాలో తప్పిన భారీ విమాన ప్రమాదం

విమానం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ విమానం రన్‌వేపై నుంచి జారి నదిలోకి దూసుకువెళ్లింది.

తుపాను సమయంలో పైలట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించడంతో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

ఘటన జరిగినప్పుడు విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

మయామి ఎయిర్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ బోయింగ్ 737 విమానం.. క్యూబాలోని గ్వాంటనామో నుంచి జాక్సన్‌విల్లేలోని ఓ సైనిక స్థావరానికి ప్రయాణమైంది.

ల్యాండింగ్ చేసేటప్పుడు విమానంపై పైలట్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారని షెరిల్ బోర్మన్ అనే ప్రయాణికురాలు సీఎన్ఎన్ వార్తా సంస్థకు చెప్పారు. విమానం నేలను తాకి, కాస్త పైకి ఎగిరి సెయింట్ జాన్స్ నదిలో పడిందని ఆమె అన్నారు.

''మేం నదిలో ఉన్నామా? సముద్రంలో పడ్డామా? అన్నది అర్థం కాలేదు. విమాన ఇంధనం కారిపోయిన వాసన కూడా వచ్చింది'' అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)