శ్రీలంక పేలుళ్లు: బురఖా ధరించిన ఈ వ్యక్తి బౌద్ధ మతస్థుడా?- BBC Fact Check

ఫొటో సోర్స్, nethnews.lk
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
శ్రీలంకలో బాంబు పేలుళ్లతో ప్రమేయం ఉందన్న అనుమానంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసిన ఓ వ్యక్తి బౌద్ధ మతస్థుడని పేర్కొంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఆదివారం శ్రీలంకలోని చర్చిలు, ప్రముఖ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఆ దేశంలో దశాబ్దం కిందటి అంతర్యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక ఘటన ఇదే.
"ముస్లిం మహిళ వేషధారణలో ఉన్న ఒక బౌద్ధ మతస్థుడిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. చర్చిలలో బాంబు దాడులకు పాల్పడిన ముఠాలో అతడు ఒకరు" అని క్యాప్షన్లు పెట్టి సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
రెండు రోజుల్లోనే ఈ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్‌లో వేలాది మంది చూశారు, షేర్ చేశారు.
మా పాఠకుల్లో ఒకరు ఈ వీడియో ప్రామాణికతను పరిశీలించాలంటూ మాకు పంపించారు.

ఫొటో సోర్స్, UGC
అయితే, ఈ వీడియో చాలా పాతదని, దీనికి శ్రీలంక పేలుళ్లకు సంబంధం లేదని మా పరిశీలనలో తేలింది.
గత కొన్నేళ్లుగా శ్రీలంకలోని బౌద్ధులకు, ముస్లింలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మార్చిలో శ్రీలంకలోని డిగానా పట్టణంలో ముస్లింలకు చెందిన దుకాణాల మీద, మసీదుల మీద కొందరు దాడి చేశారు. గడిచిన కొన్నేళ్లలో బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా కూడా వార్తా కథనాలు వచ్చాయి.
ఆ సమయంలోనే ఈ వీడియోను కొందరు షేర్ చేశారు.
తాజా బాంబు పేలుళ్లకు సంబంధించి శ్రీలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల వెనక స్థానిక ఇస్లామిస్ట్ గ్రూపు నేషనల్ తౌహీద్ జమాత్ హస్తం ఉండి ఉంటుందని శ్రీలంక ప్రభుత్వం అంటోంది. ఈ దాడులతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తూ 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరూ శ్రీలంకకు చెందినవారే.
అయితే, "ఈ దాడులకు విదేశాల్లో కుట్ర" జరిగి ఉంటుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు.
మరోవైపు, ఈ దాడులు తమ పనేనంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపు మంగళవారం ప్రకటించుకుంది. కానీ, అందుకు సంబంధించిన ప్రత ఆధారాలు మాత్రం బయటపెట్టలేదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఆ వీడియోలో వాస్తం ఏంటి?
36 సెకన్ల నిడివి ఉన్న ఆ వైరల్ వీడియోలో బురఖా ధరించి ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
శ్రీలంకకు చెందిన స్థానిక మీడియా సంస్థ "నెఠ్ న్యూస్" 2018 ఆగస్టు 29న ఆ వీడియోను షేర్ చేసినట్లు మా పరిశీలనలో వెల్లడైంది.
ఆ వార్తా కథనం ప్రకారం, శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి సమీపంలోని రాజ్‌గిరియా ప్రావిన్సులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
బురఖా ధరించి ఉన్న అతడు ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లాడు. అతని నడవడికపై అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో, ఆ అనుమానితుడిని అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, nethnews.lk
నెఠ్ న్యూస్‌ను కోట్ చేస్తూ శ్రీలంక కేంద్రంగా పనిచేసే ఎక్స్‌ప్రెస్ న్యూస్ వెబ్‌సైట్ కూడా ఆ ఘటన గురించి వార్తను ప్రచురించింది.
ఇటీవల శ్రీలంకలో పేలుళ్ల అనంతరం ఆ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై 'నెఠ్ న్యూస్' సంస్థ ఈనెల 22న ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పాత వీడియోకు తప్పుడు క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నారని పేర్కొంది.
ఆ వివరణ ఇలా ఉంది... "అవగాహన కోసం! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటిది కాదు, 2018 ఆగస్టు 29న ప్రచురించినది. బురఖా ధరించి ఉన్న శ్రీలంక వ్యక్తి అరెస్టుకు సంబంధించిన ఈ వీడియోను, ఇటీవలి బాంబు పేలుళ్లకు సంబంధించినదిగా చెబుతూ భారత్‌లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది."
భారత ఎన్నికలతో ముడిపెడుతూ మళ్లీ..
కాగా, ఈ వీడియోకూ, భారత ఎన్నికలకూ ముడిపెడుతూ తాజాగా భారత సైన్యంలో పనిచేసిన మాజీ అధికారి, కొత్తగా బీజేపీలో చేరిన మేజర్ సురేంద్ర పూనియా కూడా ట్వీట్ చేశారు. దీన్ని 22 వేల మంది చూశారు.
కానీ, ఈ వీడియోకూ, భారతదేశ ఎన్నికలకూ ఎలాంటి సంబంధం లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక పేలుళ్లు: మృతుల్లో 10 మంది భారతీయులు ‘ఏప్రిల్ మొదట్లోనే హెచ్చరించిన భారత్, అమెరికా’
- Ground Report: గ్రాహం స్టెయిన్స్ మా గుండెల్లో ఇప్పటికీ బతికున్నారు
- సౌదీలో భారత కార్మికుల కష్టాలకు కారణాలేంటి?
- శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ తినడం ఆలస్యం కాకపోతే నేనూ చనిపోయేవాడిని
- ఇదొక నిత్యపూజలు జరిగే గాంధీజీ ఆలయం
- 'ఆలయాల్లో ఆచారంపై కాదు, ఆడవాళ్ల సమస్యలపై దృష్టి పెడదాం' - రేణూ దేశాయ్
- "మా ఊళ్లో పక్కా ఇళ్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పాడు.. మట్టి ఇళ్లలోనే ఉంటాం’’
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









