ఆ ఇంట్లో రోజూ ‘మొసళ్ల’ పండగే

వీడియో క్యాప్షన్, ఆ ఇంట్లో రోజూ ‘మొసళ్ల’ పండగే

ఎన్‌గెండ్రా ఆల్బర్ట్ ఇంటి తోటలో 40కి పైగా మొసళ్లు ఉన్నాయి. జనాలకు అవి ఆహారంగా మారకుండా, తమ దేశంలో అవి అంతరించిపోకుండా చాలా కాలంగా ఆయన వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నారు.

‘వాటికి 4 రోజులకు ఒకసారి 5-10 కేజీల మాంసాన్ని పెడతాం. మనుషులకు అవి ఆహారంగా మారకుండా కాపడటానికి ప్రయత్నిస్తున్నా.

1994లో బురుండి అధ్యక్షుడు దదాయే చనిపోయాక నేను గాటుంబా వచ్చేశా. అక్కడ మొసళ్లను చంపి తినడం గమనించా. అది చూసి చాలా బాధపడ్డా. వాటిని రక్షించాలనుకున్నా.

మొదట రూ.2 వేలతో ఓ మొసలిని కొన్నాను. అలా వేటగాళ్ల నుంచి దాన్ని కాపాడాను. ఆ తరువాత క్రమంగా 12 మొసళ్లు కొన్నాను. కానీ, వాటిలో అన్నీ బతకలేదు.

కొన్నాళ్లకు 8 మాత్రమే మిగిలాయి. ఒక్కోటీ 3.5 మీటర్ల పొడవుంటుంది.

ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కష్టం వృథా పోలేదు. నా దగ్గరుండే మొసళ్ల సంఖ్య ఇప్పుడు దాదాపు 45కు చేరింది. కానీ, ఇప్పుడు వాటికి సరిపడా చోటు లేదు.

భవిష్యత్తులో మొసళ్లకు సరిపోయేలా ఓ భారీ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నదే నా లక్ష్యం. అప్పుడే ఈ దేశంలో అవి అంతరించిపోకుండా శాశ్వతంగా ఉండిపోతాయి’ అంటూ తాను మొసళ్ల సంరక్షణను ప్రారంభించిన వైనాన్ని వివరిస్తారు ఆల్బర్ట్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)