పోప్ ఫ్రాన్సిస్: ‘చర్చిల్లో లైంగిక వేధింపులు నీచమైన నేరాలు.. సిగ్గుపడుతున్నా’

ఫొటో సోర్స్, Getty Images
చర్చిల్లో మతాధికారులు, ఇతర అధికారుల వల్ల జరిగిన లైంగిక వేధింపులను నీచమైన నేరాలుగా పోప్ ఫ్రాన్సిస్ వర్ణించారు. వీటిని అడ్డుకోలేకపోయిన కేథలిక్ చర్చి వైఫల్యంపై సిగ్గుపడుతున్నట్టు తెలిపారు.
పిల్లలను వేధించడం, వాటిని దాచిన ఘటనల్లో దోషులైన మతాధికారులపై విచారణ జరిపించాలని అంతకు ముందు ఐర్లాండ్ ప్రధాని పోప్‌ను కోరారు.
మతాధికారుల లైంగిక వేధింపులకు గురైన బాధితులతో పోప్ గంటన్నర సేపు మాట్లాడారు.
39 ఏళ్లలో మొదటిసారి పోప్ ఐర్లాండులో పర్యటించారు. వరల్డ్ మీటింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ కోసం ఆయన ఈ దేశానికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేథలిక్స్ ప్రతి మూడేళ్లకొకసారి ఈ కార్యక్రమంలో కలుస్తారు.
పోప్ ఫ్రాన్సిస్ తన ప్రసంగంలో ప్రపంచంలోని 120 కోట్ల మంది రోమన్ కాథలిక్కులకు తను రాసిన లేఖను చదివారు. పిల్లలపై జరిగిన వేధింపులు, మతాధికారులు వాటిని దాచి ఉంచడాన్ని మహాపాపంగా వర్ణించారు.

ఫొటో సోర్స్, PA
పోప్ ఏం చెప్పారు?
డబ్లిన్ కాజిల్ నేతలు, ప్రతినిధులతో మాట్లాడిన పోప్ "ఐర్లాండ్‌లో చర్చి సభ్యులు చిన్నపిల్లలను వేధించారు. వారికి పిల్లల విద్య, సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇంత ఘోరమైన కళంకం తెచ్చారు. దీన్ని నేను ఎలా తిరస్కరించగలను" అన్నారు.
"చర్చి అడ్మినిస్ట్రేషన్, బిషప్, మతాధికారులు ఈ నిచమైన నేరాలను నియంత్రించడంలో విఫలమయ్యారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహం రావడం సహజమే. దీనివల్ల మొత్తం కాథలిక్ సమాజం సిగ్గుతో తల వంచుకుంది. నాకూ అలాగే అనిపిస్తోంది."
పిల్లలపై వేధింపుల గురించి మాట్లాడిన పోప్ "చర్చిల్లో ఇలాంటి ఘోరాలను సమూలంగా నాశనం చేయాలి. దీనిని ఎట్టి పరిస్థితుల్లో నేను సహించను. కఠిన చర్యలు తీసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను" అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఐర్లాండ్ ప్రధాన మంత్రి ఫిర్యాదు
పోప్ కంటే ముందు మాట్లాడిన ఐర్లాండ్ ప్రధానమంత్రి, చర్చిలు, ప్రభుత్వం, సమాజం అన్నీ విఫలం కావడంతో చాలా మందికి సరైన వారసత్వం లభించడం లేదని, అందరూ బాధలు, కష్టాలు భరించాల్సి వస్తోందని అన్నారు.
ఐర్లాండ్ అంతా చర్చించుకుంటున్న స్కాండల్స్ గురించి ప్రధాని పోప్ దగ్గర ప్రస్తావించారు. వివిధ సంస్థల ద్వారా పిల్లలను అక్రమంగా దత్తత తీసుకున్న మతాధికారులు, వారిపై లైంగిక ఆరోపణలకు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు.
"వారిని చీకటి గదుల్లో ఉంచారు, బంధించి వేధించారు. సాయం కోసం అరిచిన వారి కేకలు ఎవరికీ వినపడలేదు. హోలీ ఫాదర్, బాధితులు, బయటపడ్డ వారి మొర ఆలకించండి"

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఒక విచారణను కూడా వరాడ్కర్ ప్రస్తావించారు. అక్కడ 300 మంది మతాధికారుల ద్వారా 1000 మంది మైనర్లపై వేధింపులు జరిగాయనే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
వేధింపుల బాధితులు, వారి కుటుంబ సభ్యులు పోప్ వాహనం వెళ్తున్న దారిలో, డబ్లిన్ కాసిల్ బయట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాధితులకు గుర్తుగా పిల్లల బూట్లను రోడ్డు పక్కన ఉంచి నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- చర్చిలో లైంగిక వేధింపులు: కన్ఫెషన్స్పై ప్రశ్నలు
- పాఠశాలలు, ఆటస్థలాల్లో ముస్లిం పిల్లలకు వేధింపులు
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
- పిల్లలపై లైంగిక నేరాలు నిజంగానే పెరుగుతున్నాయా?
- దేవరియా: ‘బాలికల హాస్టల్ వద్దకు లగ్జరీ కార్లొస్తాయ్ వాటిలో ఎవరొస్తారో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు’
- యూరప్: జాతీయవాదం ఎందుకు పెరుగుతోంది? ఏ దేశంలో ఎలా ఉంది?
- హజ్ యాత్రలో మహిళలపై లైంగిక వేధింపులు
- కృత్రిమ మేధస్సు: కాల్ సెంటర్లలో ఉద్యోగాలు హుష్ కాకేనా?
- రోహింజ్యాల వలసలకు ఏడాది: శరవేగంగా ముదిరిన శరణార్థుల సంక్షోభం
- అటల్ బిహారీ వాజ్పేయి చితికి నిప్పంటించిన నమిత ఎవరు?
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- పాము కాటు: ఏ పాములు ప్రమాదకరం? కాటేసినపుడు ఏం చేయాలి?
- సిపాయిల తిరుగుబాటు: పబ్లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.










