చైనాలో కాలుష్యం తగ్గుతోందా? ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయా?

- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి, బీజింగ్ నుంచి
చైనాలో వాయు కాలుష్యానికి ఏటా 3 లక్షల 50 వేల మంది బలవుతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ప్రభుత్వ చర్యల వల్ల గత కొన్నేళ్లుగా కాలుష్యం తగ్గుతోందని భావిస్తున్నారు. మరి.. నిజంగానే ఆ చర్యలు ఫలిస్తున్నాయా?
బీజింగ్ నగరాన్ని గత ఏడాది ఓ ధూళి మేఘం చుట్టుముట్టింది.
ఆ మేఘం కిందే లక్షలాది మంది జీవిస్తున్నారు. ఆ దృశ్యాలు ప్రపంచమంతటా ప్రసారం కావటంతో పాటు.. ఆ ధూళి మేఘం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండటంతో.. చైనా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.
"కాలుష్యం తీవ్రత ప్రాథమిక దశలో ఉంటే బీజింగ్ సమీపంలోని కర్మాగారాల మీద, ప్రభుత్వ వాహనాల వినియోగం మీద పరిమితులు విధిస్తారు. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటే.. రోడ్ల మీద తిరిగే వాహనాలపై సరి - బేసి నంబర్ల షరతులు ఉంటాయి. భారీ సదస్సులు జరిగేటప్పుడు స్కూళ్లు, కర్మాగారాలు మూసివేస్తారు. కార్లు తిరగకుండా నిలిపివేస్తారు’’ అని కేంబ్రిడ్జ్ మాస్క్ కంపెనీ ఫౌండర్ - సీఈఓ క్రిస్టొఫర్ డాబింగ్ బీబీసీకి చెప్పారు.
బీజింగ్ వంటి పెద్ద నగరాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ఇక్కడ కాలుష్యం తగ్గిందని స్థానికులు చెప్తారు. అందుకు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఓ కారణం.
కానీ ఈ కార్లు నడవటానికి ఉపయోగించే విద్యుత్‌ను.. బొగ్గును మండించే ఉత్పత్తి చేస్తున్నారు. దాంతో భారీ ఎత్తున కాలుష్యం వెలువడుతూనే ఉంది.
‘‘చైనా బొగ్గు నాసిరకమైనది. దాన్ని మండిస్తే పెద్దఎత్తున కాలుష్యం వెలువడుతుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించటానికి ఇండొనేసియా, ఆస్ట్రేలియాల నుంచి చైనా బొగ్గు దిగుమతి చేసుకుంటుంది. లేదంటే బొగ్గుకు కోక్ కలుపుతుంది’’ అని పాత్రికేయులు సైబల్ దాస్‌గుప్తా వివరించారు.

కాలుష్యం నుంచి విముక్తి పొందాలంటే చైనా తన ఇంధన అవసరాలకు బొగ్గు మీద ఆధారపడటం తగ్గించాల్సి ఉంటుంది. అలా చేయకుంటే.. కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో తగ్గించడం పెద్ద సవాలే.
ఇవి కూడా చదవండి:
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- #లబ్‌డబ్బు: భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- డీడీ కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారు
- టెలిగ్రాం యాప్ భారత్‌దేనా?
- ‘రేపిస్టులకు మరణశిక్ష’ చట్టంతో అత్యాచారాలు ఆగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









