పాకిస్తాన్ ఎన్నికలు.. మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో ఈ నెల 25న బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఐదు ముఖ్యాంశాలు ఇవీ...
1. పాక్‌లో ఒక్క ప్రధాని కూడా పదవీకాలాన్ని పూర్తిచేసుకోలేదు. ఒక పౌర ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోవడం చరిత్రలోనే ఇది రెండోసారి. గతంలో ప్రభుత్వాలు సైనిక తిరుగుబాట్ల వల్ల కూలిపోయాయి, లేదా అధికారంలోని నాయకులను కోర్టులు పదవీచ్యుతులను చేశాయి.
2. ఈసారి ఎన్నికల్లో పోటీచేయకుండా పాక్ మాజీ ప్రధాని, కీలక నేత నవాజ్ షరీఫ్‌పై నిషేధం అమలవుతోంది. మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన షరీఫ్ 2017లో పదవీచ్యుతులయ్యారు. అవినీతి కేసులో పదేళ్ల శిక్ష పడి జులైలో ఆయన జైలు పాలయ్యారు.
3. ముందెన్నడూ లేనంత పెద్దసంఖ్యలో మహిళలు ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. 272 పార్లమెంటరీ సీట్లకు 171 మంది మహిళలు బరిలో నిలిచారు.
4. అతివాద గ్రూపులు కూడా ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ పరిణామంపై కొన్ని మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
5. పాకిస్తాన్ ఎన్నికల్లో నలుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు తలపడుతున్నారు. ట్రాన్స్‌జెండర్లకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం తొలిసారిగా 2013లో లభించింది.
మరింత సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ ఎన్నికలు: గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు ఏమిటి?
- గ్రౌండ్ రిపోర్ట్ : అల్వర్‌లో ఆవులు తోలుకెళ్తున్న ముస్లిం యువకుడిని ఎవరు చంపారు?
- కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- చైనాలోని ఈ భారీ యంత్రాలు చూస్తే ఔరా అంటారు
- భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?
- శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేదంటే..
- పాకిస్తాన్: నవాజ్, ఇమ్రాన్, బిలావల్ల బలాబలాలు, ఈ ఎన్నికల ప్రాధాన్యతలు
- వాట్సప్: 'ఇక మెసేజీని ఐదుసార్లకు మించి ఫార్వర్డ్ చేయలేరు'
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- అవిశ్వాసం ఆటలో ఎవరికెన్ని పాయింట్లు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









