రావోయి మా ఇంటికి... పుతిన్‌కు ట్రంప్ ఆహ్వానం

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, అమెరికాల మధ్య ఇప్పటికే చిగురు తొడిగిన స్నేహం మరింతగా వికసిస్తోంది. రెండు దేశాల అధ్యక్షులు సమావేశమైన వారం రోజుల్లోనే రెండో భేటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే ఈసారి తటస్థ వేదికలపై కాకుండా తమ సొంత దేశంలోనే ఈ భేటీ ఉండేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఆహ్వానిస్తున్నారు.
ఈ శరత్కాలంలో అమెరికాలో పర్యటించాలని పుతిన్‌ను ఆహ్వానిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. ఈ మేరకు పుతిన్‌ను వాషింగ్టన్ రమ్మని పిలవాలంటూ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్డన్‌కు అధ్యక్షుడు సూచించారని సారా ట్వీట్ చేశారు.
కాగా ఇటీవల ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ఈ ఇద్దరు నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటీ విజయవంతమైందని.. మరోసారి పుతిన్‌తో భేటీ కోసం ఎదురుచూస్తున్నానని ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే శాండర్స్ ఈ విషయం వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాగా ఇటీవలి సమావేశంలో ట్రంప్, పుతిన్ ఏం మాట్లాడుకున్నారన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారు చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంతవరకు వెల్లడికాలేదు. దీంతో ఆ వివరాలు వెల్లడించాలంటూ అమెరికా రాజకీయ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
దీనిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ స్పందిస్తూ... తనకు కూడా ఇంతవరకు వారేమీ మాట్లాడుకున్నారో తెలియదని.. ఇద్దరు అధ్యక్షులతో పాటు దుబాసీలు మాత్రమే అక్కడున్నారని, ఇంకెవరికీ ఏమీ తెలియదని చెప్పారు.
ట్రంప్, పుతిన్ తదుపరి భేటీ గురించి ఆయనకు తెలియగానే ''అది మరింత ప్రత్యేకం కానుంది'' అంటూ ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, AFP
మరోవైపు అమెరికా సెనేట్‌లో డెమోక్రటిక్ పార్టీ నేత అయిన చంక్ షూమర్ కూడా మొన్నటి ట్రంప్, పుతిన్‌ల సమావేశపు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఆ వివరాలు తెలియజేశాకే ట్రంప్ మళ్లీ పుతిన్‌తో భేటీ కావాలని ఆయన అన్నారు.
అమెరికాలో కానీ, రష్యాలో కానీ, ఇంకెక్కడైనా కానీ... మళ్లీ పుతిన్‌తో భేటీ కావాలనుకుంటే గత సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించాల్సిందేనని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’
- #లబ్‌డబ్బు: పీఎఫ్ నిబంధనల్లో మార్పులతో ప్రయోజనాలివే
- వాట్సాప్ వదంతులు: చిన్న పిల్లలకు చాక్లెట్లు పంచారని గ్రామస్తుల దాడి.. బీదర్‌లో హైదరాబాద్ వాసి మృతి
- రెండో ప్రపంచ యుద్ధం: ఆహారంపై ఆంక్షలు
- 'జలియన్‌వాలాబాగ్ నరమేధానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందే'
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
- డేటా బ్రీచ్: ఫేస్‌బుక్‌కు 46 కోట్ల జరిమానా విధించనున్న బ్రిటన్
- ‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









