పాకిస్తాన్ ఎన్నికలు: 'డాన్' పత్రికాధిపతి బీబీసీ ఇంటర్వ్యూపై వివాదం

పాకిస్తాన్‌లో ఎన్నికలు మరో వారం రోజులు ఉందనగా, ఆ దేశంలోని ప్రముఖ ఇంగ్లిష్ వార్తా పత్రిక 'డాన్' అధినేత బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదం అవుతోంది.
ఎన్నికల్లో సైన్యం జోక్యం ఎక్కువైందని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, అతడి పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్)కి అది కొమ్ముకాస్తోందని 'డాన్' మీడియా గ్రూప్ సీఈఓ హమీద్ హరూన్ ఆరోపించారు.
బీబీసీ 'హార్డ్‌టాక్' ఇంటర్వ్యూలో హరూన్, పాక్ మాజీ ప్రధాని, ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థి నవాజ్ షరీఫ్‌కు అనుకూలంగా మాట్లాడినట్టు ఆరోపణలు వస్తునాయి. సైన్యంపై ఆరోపణలకు హరూన్ ఏ ఆధారాలూ చూపలేదంటూ కొందరు విమర్శిస్తున్నారు.
జులై 25న జరగనున్న ఎన్నికలకు ముందు డాన్ సహా దేశంలోని ఇతర వార్తా పత్రికలు సెన్సార్ షిప్, బెదిరింపులు ఎదుర్కొన్నాయి.
ఆల్ పాకిస్తాన్ న్యూస్ పేపర్స్ సొసైటీ అధ్యక్షుడు కూడా అయిన హరూన్, సోమవారం ప్రసారమైన బీబీసీ ఇంటర్వ్యూలో సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. 'పత్రికా స్వేచ్ఛ'పై ఎప్పుడూ లేనంత దాడి జరుగుతోందని అన్నారు.

హార్డ్‌టాక్ హోస్ట్ స్టీఫెన్ సకుర్‌తో మాట్లాడిన హరూన్ "ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా కొందరు రాజకీయ పరిశీలకులు ఆరోపించినట్టు.. సైన్యం తాము ఎంచుకున్న కొందరు అభ్యర్థుల తరఫున పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది" అని అన్నారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సైన్యం తరచూ పాకిస్తాన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. ఆ దేశం చాలాసార్లు ప్రజాస్వామ్యం, సైనిక పాలన మధ్య ఊగిసలాడింది.
కానీ, వచ్చే వారం జరగబోయే ఎన్నికల్లో తమ జోక్యం ఉందని వస్తున్న వార్తలను సైన్యం ఖండించింది.
ఇటు హరూన్ మాత్రం "ప్రస్తుతం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న ద్వితీయ స్థాయి నేతలకు మద్దతు ఇచ్చి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి, వారిని తమ కనుసన్నల్లో ఉంచుకునేలా సైన్యం ప్రయత్నిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది" అని ఇంటర్వ్యూలో అన్నారు.
"ఇమ్రాన్ ఖాన్, అతడి పీటీఐ పార్టీ గురించే అలా అంటున్నారా?" అనే ప్రశ్నకు హరూన్ "చాలా సార్లు సైన్యంతో ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కొన్నిసార్లు ఆయన పార్టీలోని మిగతా వారి పేర్లు కూడా వస్తున్నాయి" అని చెప్పారు.
"అలా అనడానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా?" అని అడిగినపుడు "ఈ రోజు పాకిస్తాన్‌లో అనుమానాలు, మానవ హక్కుల సంస్థల పనులు, రాజకీయ వ్యాఖ్యలను మనం కొంతవరకూ ఆధారాలుగా తీసుకోవచ్చని అనిపిస్తోంది" అని హరూన్ అన్నారు.
"నేను నిజానికి దేశానికి వ్యతిరేకంగా ఇలా వ్యాఖ్యానించడం లేదు. మీడియాతో సఖ్యతతో ఉండేందుకు, సాధారణ ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాను" అని హరూన్ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
సైన్యం జోక్యానికి ఆధారం వెతకడం సులభం కాదు
ఎం ఇలియాస్ లాంటి విశ్లేషకులు మాత్రం.. సైనిక జోక్యం వల్ల మీడియా సంస్థలకు, ఇతర వ్యాపారాలకు ఆదాయంలో తేడాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎలాంటి ప్రకటన, నివేదికలు లేకుండానే వాళ్లు అలా చేయొచ్చు, అందుకే సైనిక జోక్యంపై ఆధారాల కోసం వెతకడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదన్నారు.
"ఒక అపరిచిత కాలర్ ఫోన్ చేసి తనను ఐఎస్ఐ కల్నల్ లేదా బ్రిగేడియర్ అని చెప్పుకుంటాడు. ఒక ఛానల్‌ను 2 నుంచి 15కు మార్చమని కేబుల్ సర్వీస్ ఆపరేటరును ఆదేశిస్తాడు. అలాంటప్పుడు వాళ్లు చెప్పింది చేయడం తప్ప, వేరే ఏం చేయగలం" అని విశ్లేషకులు అంటున్నారు.
"ఇటీవల ఇస్లామాబాద్ ప్రధాన కేబుల్ నెట్‌వర్క్‌లో డాన్ న్యూస్ ఛానల్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అది 9 నుంచి 28కి పడిపోయింది. మొదట్లో నేను దాన్ని బ్లాక్ చేశారేమో అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత అది వేరే నంబర్‌లో కనిపించింది. సాధారణ ప్రేక్షకుడు ఒకసారి అది కనిపించకపోతే, తర్వాత దాని గురించి పట్టించుకోడు. అంటే ఛానల్ వ్యూయర్‌షిప్ కోల్పోతుంది. దాంతో చివరికి యాడ్ రెవెన్యూ కూడా పడిపోతుంది" అని ఇలియాస్ చెప్పారు.
అయినా, "పాకిస్తాన్‌లోని మిగతా మీడియా సంస్థల కంటే చెప్పుకోదగ్గ వనరులు ఉన్న 'డాన్' సైన్యాన్ని ఎదిరించి నిలబడింది. తమ ఎడిటోరియల్ పాలసీపై వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది" అన్నారు.
ఇటు హరూన్ బీబీసీ ఇంటర్వ్యూపై స్పందించిన పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీకి వ్యతిరేకంగా డాన్ 'పక్షపాతం' చూపిస్తోందని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సైన్యానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన హరూన్, దానికి తగినట్టు బలమైన ఆధారాలు కూడా చూపించాలని కొందరు అంటున్నారు.
చిన్నప్పటి నుంచి 'డాన్' చదువుతున్నానని చెప్పిన ఒక ట్విటర్ యూజర్ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా హమీద్ హరూన్ చేస్తున్న వ్యాఖ్యలు వంద శాతం నవాజ్ షరీఫ్ మాటల్లాగే ఉన్నాయని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కొంతమంది జర్నలిస్టులు, సోషల్ మీడియా యూజర్లు డాన్‌ను సమర్థిస్తున్నారు. సైన్యం హరూన్‌ను కష్టాల్లో పడేసిందని చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
డాన్, ఇతర న్యూస్ పేపర్లను దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని హరూన్ తన ఇంటర్వ్యూలో ఆరోపించారు. చాలా మంది జర్నలిస్టులతో బలవంతంగా "సెల్ఫ్ సెన్సార్‌షిప్" చేయిస్తున్నారని అన్నారు..

డాన్‌ను చాలా మంది నవాజ్ షరీఫ్ అనుకూల మీడియాగా చూస్తున్నారని స్టీఫెన్ సకుర్ అడిగినపుడు "డాన్ వ్యతిరేకులు అలా ప్రచారం చేస్తున్నారని, తమ దారిలో ఉన్న ఎవరినైనా పాకిస్తానీ నిఘా సంస్థలు వెంటాడుతాయని" హరూన్ చెప్పారు.
"సైన్యం తప్పు దారిలో వెళ్తోందని అందరికీ చెప్పే మెసెంజర్ కావాలనుకుంది డాన్. అలాంటప్పుడు ఆ మెసెంజర్‌ను కాల్చిచంపడం అనేది వారికి చాలా కీలకం అనిపిస్తోంది" అని హరూన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఓజోన్ రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా?
- ‘నీళ్లు తాగి ప్రాణాలు నిలుపుకున్నాం.. ’: మీడియాతో థాయ్ బాలలు
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
- #BBCArchives: ఆకాశంలో ఎగిరే పళ్లాలు నిజంగానే ఉన్నాయా?
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











