ఇండోనేషియా: మొసళ్లపై ప్రతీకారం తీర్చుకున్నారు

ఫొటో సోర్స్, REUTERS
ఇండోనేషియాలో ఒక మొసలి స్థానికుణ్ని చంపేసిందన్న కోపంతో గ్రామస్థులు సుమారు 300 మొసళ్లను చంపేశారు.
అక్కడి వెస్ట్ పపువా ప్రావిన్స్‌లో జరిగిన ఈ సంఘటనను అధికారులు కానీ, పోలీసులు కానీ అడ్డుకోలేకపోయారు.
ఇండోనేషియాలో మొసళ్లను చంపడం నేరం. దీనికి శిక్షగా జరిమానా లేదా జైలుశిక్ష విధించొచ్చు.
శుక్రవారం ఉదయం స్థానికుడొకరు ఓ మొసళ్ల సంరక్షణ కేంద్రం వద్ద కూరగాయలు కోసుకుంటుండగా, ఓ మొసలి దాడి చేసి అయన్ను చంపేసింది.

ఫొటో సోర్స్, Getty Images
శనివారం అతని అంత్యక్రియల అనంతరం కొన్ని వందల మంది స్థానికులు కత్తులు, ఇతర మారణాయుధాలతో ఆ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి వెళ్లారు.
మొదట ఆ కేంద్రం కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత అక్కడ పెంచుతున్న సుమారు 300 మొసళ్లను చంపేశారు.
ఈ కేంద్రంలో ఉప్పునీటి, న్యూ గినియా జాతికి చెందిన మొసళ్లను సంరక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








