స్పైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త మృతి

స్పైడర్ మ్యాన్ పుస్తకం

ఫొటో సోర్స్, Getty Images

స్పైడర్ మ్యాన్‌ సహ సృష్టికర్త స్టీవ్ డిట్కో (90) న్యూయార్క్‌లో మరణించారని పోలీసులు తెలిపారు.

మన్‌హట్టన్‌లోని తన ఫ్లాట్‌లో జూన్ 20వ తేదీన అచేతనంగా పడి ఉన్న డిట్కో మృతి చెందారని వైద్య సిబ్బంది ప్రకటించారు.

రచయిత నీల్ గాయ్‌మాన్ సహా చాలామంది అభిమానులు డిట్కోకు నివాళులర్పించారు.

1960ల్లో మార్వెల్ కామిక్స్‌లో ఉండగా.. ఆయన ఆ కంపెనీ ఉద్యోగి, తర్వాత కాలంలో సీఈఓ అయిన స్టాన్‌ లీతో కలసి స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ పాత్రల్ని సృష్టించి ప్రజాదరణ పొందారు.

సాలీడు శక్తులు కలిగిన ఒక టీనేజీ సూపర్ హీరో అనే ఆలోచనను లీ ప్రతిపాదించారని బీబీసీ నార్త్ అమెరికా ప్రతినిధి క్రిస్ బుక్లెర్ చెప్పారు.

ఆ ఆలోచన ఆధారంగా నీలం, ఎరుపు రంగుల దుస్తుల్లో స్పైడర్ మ్యాన్‌కు రూపం ఇచ్చింది, మణికట్టు నుంచి సాలిగూళ్లను ప్రయోగించే శక్తిని స్పైడర్ మ్యాన్‌కు జోడించింది డిట్కోయే.

స్పైడర్ మ్యాన్ పుస్తకం

ఫొటో సోర్స్, Getty Images

లీతో విభేదాల కారణంగా 1966లో మార్వెల్ కామిక్స్ కంపెనీని డిట్కో వదిలిపెట్టారు. తర్వాత డీసీ కామిక్స్‌లో చేరి మరో సూపర్ హీరో క్రీపర్‌ను సృష్టించారు.

ఆయన ప్రచారానికి దూరంగా ఉండేవారు. 2007లో బీబీసీ రూపొందించిన ‘ఇన్ సెర్చ్ ఆఫ్ స్టీవ్ డిట్కో’ డాక్యుమెంటరీ చిత్రంలో కనిపించేందుకు కూడా ఆయన నిరాకరించారు.

అయితే, ఈ డాక్యుమెంటరీని రూపొందించిన బ్రిటిష్ టీవీ ప్రజెంటర్ జొనాథన్ రాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని ఏకైక గొప్ప కామిక్ పుస్తక కళాకారుడు, సృష్టికర్త’’ అని డిట్కోను అభివర్ణించారు.

స్పైడర్ మ్యాన్ పుస్తకం

ఫొటో సోర్స్, Getty Images

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)