వైట్ హౌస్: నాలుగు రోజులకే మాక్రాన్ మొక్క మాయం

డొనాల్డ్ ట్రంప్, ఎమ్మానుయెల్ మాక్రన్, వైట్ హౌస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొక్క నాటుతున్న ట్రంప్, మాక్రాన్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుకరించిన మొక్క మాయమైంది.

గత వారం మాక్రాన్ అమెరికాను సందర్శించినపుడు వారిద్దరూ వైట్ హస్ ప్రాంగణంలో ఆ మొక్కను నాటారు. ఈ యూరోపియన్ సెసైల్ ఓక్ మొక్కను మొదటి ప్రపంచయుద్ధం జరిగిన ఈశాన్య ఫ్రాన్స్ నుంచి తీసుకువచ్చారు.

పారిస్‌కు ఈశాన్య ప్రాంతంలో జరిగిన నాటి యుద్ధంలో 2 వేల మంది అమెరికా సైనికులు మరణించారు.

అయితే నాటిన నాలుగు రోజులకే ఆ మొక్క మాయమైంది.

డొనాల్డ్ ట్రంప్, ఎమ్మానుయెల్ మాక్రన్, వైట్ హౌస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వైట్ హౌస్‌లో మొక్క నాటిన ప్రదేశం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది

శనివారం రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ మొక్క ఉన్న ప్రదేశాన్ని ఫొటో తీసినపుడు అక్కడ కేవలం పచ్చగడ్డి మాత్రమే కనిపించింది.

ఈ మొక్క ఏమైపోయిందనే దానిపై వైట్ హౌస్ అధికారులు నోరు మెదపనప్పటికీ, ఆన్‌లైన్‌లో మాత్రం దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఫ్రెంచి రేడియో నెట్‌వర్క్ 'ఫ్రాన్స్‌ఇన్‌ఫో', వేసవిని తట్టుకోలేదనే అనుమానంతో దానిని తొలగించి ఉండవచ్చని, మళ్లీ దాన్ని అక్టోబర్‌లో తిరిగి నాటవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

డొనాల్డ్ ట్రంప్, ఎమ్మానుయెల్ మాక్రన్ , వైట్ హౌస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా కస్టమ్స్ చట్టాల ప్రకారం ఏవైనా విదేశీ మొక్కలను దేశంలోకి తెచ్చే ముందు వాటికి ఒక 'ఫొటోసానిటరీ సర్టిఫికేట్'ను సమర్పించాల్సి ఉంటుంది. అందువల్ల దానిని ప్రస్తుతానికి నర్సరీలో ఉంచారని ఫ్రాన్స్ అధికారి ఒకరు పేర్కొన్నట్లు 'హఫింగ్‌టన్ పోస్ట్' కథనం పేర్కొంది.

మొత్తం మీద మాక్రన్ నాటిన మొక్క మాయం కావడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)