డిజిటల్ యుగంలో సాంప్రదాయ గడియారాలతో ‘ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు’

- రచయిత, సీన్ కాఫ్‌లన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పరీక్ష హాళ్లలో విద్యార్థులకు గడియారం ఎంత ముఖ్యమో మనకందరికీ తెలిసిందే. కానీ నేటి డిజిటల్ తరంలో గోడ మీద ముళ్ల గడియారం ఉంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
అందువల్లే ఇటీవలి కాలంలో తరగతి గదుల్లో పాతకాలం ముళ్ల గడియారాల బదులు, డిజిటల్ గడియారాలు పెట్టాలనే ప్రతిపాదన వినిపిస్తోంది.
ఇటీవల 'టైమ్స్ ఎడ్యుకేషనల్ సప్లిమెంట్' వెలువరించిన ఒక నివేదిక - ఈతరం పిల్లలు సమయం తెలుసుకోవడానికి డిజిటల్ గడియారాల మీదే ఆధారపడుతున్నారని పేర్కొంది.
బ్రిటన్‌లోని ఉపాధ్యాయుల యూనియన్‌కు చెందిన మాల్కమ్ ట్రోబ్ కూడా - నేటి తరం టైం తెలుసుకోవడానికి డిజిటల్ ఫార్మాట్ ఉన్న మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లపై ఆధారపడుతున్నారని తెలిపారు.
అందువల్ల ''పరీక్షా కేంద్రాల్లో డిజిటల్ గడియారాలను పెట్టడం వల్ల వారు ప్రశ్నలకు సమాధానం రాసేప్పుడు పొరపాటు చేసే అవకాశం ఉండదు'' అని ట్రోబ్ తెలిపారు.
దీనికి ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఒక ప్రశ్నకు 15 నిమిషాలలో సమధానాం రాయాల్సి వస్తే, డిజిటల్ గడియారంలో సమయాన్ని చూసే విద్యార్థులు తక్కువ తప్పులు చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతానికి బ్రిటన్‌లోని పాఠశాలల్లో ముళ్ల గడియారాలను తొలగించే ఆలోచనేదీ లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఉపాధ్యాయుల నుంచి దీనిపై పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి.
మిస్ కీనన్ అనే ఉపాధ్యాయురాలు, ముళ్ల గడియారం చూసి విద్యార్థులు టైమ్ చెప్పలేరన్నది సరికాకున్నా, కొంతమంది విషయంలో మాత్రం అది ఆటంకంగా నిలుస్తోందన్నారు.
నేటి డిజిటల్ తరంలో ముళ్ల గడియారాలకు కాలం చెల్లిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- బెంగళూరు: 'ట్రాఫిక్ వల్ల నా స్నేహితులు ఉద్యోగాలే మానేశారు'
- ‘బిన్ లాడెన్ బాడీగార్డు’కు జర్మనీలో జీవన భృతి
- గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
- #గమ్యం: క్రియేటివిటీ ఉంటే అవకాశాలకు హద్దే లేదు!
- #గమ్యం: బీటెక్ తర్వాత ఏం చేయాలి? ఎంబీఏ-ఎంటెక్-జాబ్!?
- #గమ్యం: ఈ 10 అంశాలు పాటించండి! పరీక్షల ఒత్తిడిని జయించండి!!
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- లబ్..డబ్బు: ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఏం చేస్తే జాబ్ గ్యారెంటీ ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








