శ్రీలంకలో ఎమర్జెన్సీ తొలగింపు

ఫొటో సోర్స్, AFP
శ్రీలంకలో ఎమర్జెన్సీని తొలగించారు.
శ్రీలంకలో ముస్లింలకు, సింహళీయులకు మధ్య చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో మార్చి 6న ఆ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.
ఈ మత ఘర్షణల నేపథ్యంలో కండీ జిల్లాలో ఇంతవరకూ ఇద్దరు మరణించగా, ముస్లింలకు చెందిన దాదాపు 450 నివాసాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. 60 వాహనాలు దగ్ధమయ్యాయి.
అల్లర్లను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించడంతోపాటుగా, సోషల్ మీడియాపై కూడా నిషేధాజ్ఞలు విధించారు.
బౌద్ధ మతం ఆధిపత్య దేశంలో.. 2012 నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘర్షణలకు బౌద్ధ మత వర్గాలే ఆజ్యం పోస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ముస్లింలు బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని, పురాతన బౌద్ధాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారని బౌద్ధులు ఆరోపిస్తున్నారు.
కొన్నేళ్లుగా చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో.. డజన్ల కొద్దీ ముస్లిం ప్రార్థనా స్థలాలు కూడా ధ్వంసమయ్యాయి.
ఘర్షణలకు కారకుడని భావిస్తోన్న బౌద్ధ వర్గాల నాయకుడితో పాటు.. ఇప్పటివరకు 300 మందిని అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, AFP
కండి ప్రాంతంలో వందల మంది బలగాలను మోహరించారు. కర్ఫ్యూ సమయంలో టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు.
ఆదివారం నాడు.. ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ట్విటర్‌లో ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాపై ఉన్న ఆంక్షలను ఈ వారం మొదట్లోనే ఎత్తివేశారు.
గడిచిన ఏడేళ్లలో శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించడం ఇదే తొలిసారి. కానీ.. శ్రీలంక ప్రజలకు మాత్రం ఎమర్జెన్సీ ఇది తొలిసారి కాదు. తమిళ తిరుగుబాటుదార్లతో జరిగిన పోరాటం నేపథ్యంలో 2009కు ముందు శ్రీలంకలో 30ఏళ్లు ఎమర్జెన్సీ విధించారు.
ఇవి కూడా చదవండి
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- గ్రౌండ్ రిపోర్ట్: ‘‘భయపడొద్దమ్మా, జంతువులు నన్నేమీ చేయలేవు’’ అని చెప్పేవాడు
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- లబ్..డబ్బు: డిస్కౌంట్లు, ఆఫర్ల వలలో పడుతున్నారా?
- భారత్‌ను ప్రశంసించిన పాకిస్తానీ యాంకర్
- హాఫిజ్ సయీద్ పాకిస్తాన్‌కు భారమేనా?
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








