16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్‌ల అమ్మకాలు బంద్.. బ్రిటన్ సూపర్ మార్కెట్ల నిర్ణయం

ఫొటో సోర్స్, iStock
16 ఏళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్‌లను అమ్మకూడదని బ్రిటన్‌లోని సూపర్ మార్కెట్లు నిర్ణయించాయి. ఈ పానీయాల్లో అత్యధిక మొత్తంలో చక్కెన, కెఫీన్‌లు ఉంటున్నాయన్న ఆందోళనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాయి.
లీటరు పానీయంలో 150 మిల్లీ గ్రాములకు మించి కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్‌లను 16 ఏళ్ల లోపు వారికి విక్రయించరాదని బూట్స్, అస్డా, వెయిట్రోస్, టెస్కో, కోఅప్ వంటి సూపర్ మార్కెట్లు తీర్మానించుకున్నాయి.
చిన్న పిల్లలు ఎక్కువగా ఈ ఎనర్జీ డ్రింక్‌లను తాగుతున్నారంటూ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలోనే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కోఅప్ తెలిపింది.
అల్డి, లిడ్ల్, సాన్స్‌బరీస్, మొర్రిసన్స్ వంటి పలు సూపర్ మార్కెట్లు కూడా స్వచ్ఛందంగా ఈ అమ్మకాల నిషేధాన్ని పాటించనున్నాయి.
తమ వినియోగదారులు ఆరోగ్యవంతమైన జీవితాలను పొందేందుకు సహకరించటమే ఎప్పటికీ తమ ప్రధాన ఉద్దేశ్యమని బూట్స్ అధికార ప్రతినిధి చెప్పారు.
‘‘అత్యధిక చక్కెర, కెఫీన్ ఉన్న ఈ ఎనర్జీ డ్రింక్‌లను యువతీ, యువకులు ఎక్కువగా తాగుతున్నారంటూ ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనల్ని మేం పట్టించుకున్నాం’’ అని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పూర్తిగా నిషేధించాలి
బ్రిటన్‌లో ఎనర్జీ డ్రింక్‌లను పూర్తిగా నిషేధించాలంటూ కొన్ని వారాల కిందట ప్రధానమంత్రి థెరిస్సా మేను ఎంపీ మారియా కాల్‌ఫీల్డ్ కోరారు.
ఎనర్జీ డ్రింక్‌లను దేశవ్యాప్తంగా నిషేధించాలంటూ ఉద్యమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే సూపర్ మార్కెట్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
సెలబ్రిటీ జామీ ఒలివర్ #NotForChildren అనే ఉద్యమానికి నేతృత్వం వహించారు. తాజాగా సూపర్ మార్కెట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ.. ‘మంచిపని చేశారు’ అని ట్వీట్ చేశారు.
స్కూళ్లు తమ ప్రాంగణాల్లో ఎనర్జీ డ్రింక్‌లను విక్రయించరాదని, పిల్లలకు ఈ పానీయాలను అమ్మటంపై నియంత్రణలు ఉండాలంటూ ఎన్‌ఏఎస్‌యూడబ్ల్యుటీ ఉపాధ్యాయ సంఘం కూడా ఉద్యమం నడిపింది.
ఈ డ్రింక్‌లను పిల్లలు తాగటం వల్ల స్కూళ్లలో వారి ప్రవర్తనపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఈ పరిస్థితుల్ని ఉపాధ్యాయులే పరిష్కరించాల్సి వస్తోందని సంఘం ప్రధాన కార్యదర్శి క్రిస్ కీట్స్ బీబీసీతో అన్నారు.
‘‘ఈ డ్రింక్‌లు దీర్ఘకాలంలో ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాల గురించి అవగాహన లేకపోవటంతో ఇవి సాధారణ సాఫ్ట్ డ్రింక్‌లేనని పిల్లలు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు’’ అని కీట్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పండ్ల రసాలు తాగుతున్నారా! పళ్లు జాగ్రత్త!!
- వైన్‌తో ‘దంత సమస్యలు దూరం’!
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- బాడీహ్యాకర్లు: సాహసోపేతం, స్ఫూర్తిదాయకం.. భీతావహం
- ‘గ్యాస్’ ప్రాబ్లమ్? ఎందుకిలా వదులుతారు? దీన్ని ఆపొచ్చా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








