అమెరికా గన్ లాబీ: ఆయుధాలు నిషేధిస్తామంటే ఎలా ఒప్పుకుంటాం?

ఫొటో సోర్స్, EPA
అమెరికాలో ఆయుధ నియంత్రణ దిశగా చర్యలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ ఆ ప్రతిపాదనలకు అంగీకరించేది లేదని గన్ లాబీయింగ్ సంస్థ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 14న ఫ్లోరిడాలోని మెజరరీ స్టోన్‌మేన్ డగల్ హైస్కూల్‌లో కాల్పుల ఘటన తర్వాత ఆమెరికాలో ఆయుధాలపై నియంత్రణ విధించాలన్న డిమాండ్ ఊపందుకుంది.
మొదట్లో ఆయుధాల నియంత్రణ ఆలోచనే లేదన్న ట్రంప్.. అన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో వైఖరి మార్చుకున్నారు.
అమెరికాలో గన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.
17 మంది చనిపోయిన ఫ్లోరిడా కాల్పుల ఘటన తర్వాత ఎన్‌ఆర్ఏపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆయుధ చట్టాలను కఠినతరం చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. విద్యార్థులు నిరసన బాట పట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, కొందరు విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరవుతున్నారు.
ఫిబ్రవరి 14 తర్వాత విద్యార్థులు స్కూల్‌కి తిరిగి రావడం ఇదే తొలిసారి.
బుధవారం నుంచి స్కూల్ యథావిథిగా పనిచేసే అవకాశం ఉంది.
ఆయుధాల నియంత్రణపై ఎన్‌ఆర్ఏ ఏమంటోంది?
ఆయుధాలపై నిషేధం విధించే ప్రతిపాదనలకు అంగీకరించే ప్రసక్తే లేదని ఎన్‌ఆర్ఏ అధికార ప్రతినిధి ధనాలోచ్ ఏబీసీ వార్తాసంస్థతో చెప్పారు.
ఫ్లోరిడా ఘటనకు ఎన్‌ఆర్ఏ కారణం కాదని, స్థానిక యంత్రాంగం, పోలీసుల వైఫల్యం వల్లే అది జరిగిందని ఆమె చెప్పారు. రాజకీయ నాయకుల మౌనం కూడా దీనికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
కాల్పులు జరుగుతున్న సమయంలో స్కూల్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి అటువైపే వెళ్లకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.
2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు ఎన్‌ఆర్ఏ మద్దతు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
గన్ కంట్రోల్‌పై ట్రంప్ ఏమన్నారు?
'టీచర్లకు ఆయుధాలు ఇస్తే ఫ్లోరిడా వంటి ఘటనలు మళ్లీ జరగవు' అని ట్రంప్ ఇటీవల అన్నారు.
ఆయుధాల కొనుగోలు వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు.
ఆయుధాలను సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్‌గా మార్చడాన్ని కూడా ట్రంప్ వ్యతిరేకించారు.
గన్ కొనుగోలు సమయంలో సమగ్ర విచారణ చేయాలని ఆయన సూచించారు.
విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు?
గత బుధవారం 40మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో ట్రంప్ సమావేశమయ్యారు. గన్ కంట్రోల్‌కు తీసుకోవాల్సిన చర్యలు, వారి విజ్ఞప్తులను స్వీకరించారు.
ఫ్లోరిడా కాల్పుల్లో కుమార్తెను కోల్పోయిన ఆండ్రూ పొల్లాక్ ఉద్వేగంగా మాట్లాడారు.
'నా కూతురు చనిపోయింది. నేను మళ్లీ నా కూతుర్ని చూడగలనా? మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలి' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
'గన్నుకు గన్ను సమాధానం కాదు' అని 2012లో జరిగిన కాల్పుల్లో కుమారుడిని కోల్పోయిన మార్క్ బర్డెన్ అన్నారు.
కొన్ని రకాల ఆయుధాలపై నిషేధం విధించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
వాషింగ్టన్ డీసీలో వందలాది మంది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
టీచర్లకు ఆయుధాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు వారిలో కొందరు మద్దతు తెలిపారు.
కానీ ఆయుధాల నిషేధం లేదా నియంత్రణకు అంగీకరించేది లేదని గన్ లాబీయింగ్ సంస్థ-ఎన్ఆర్ఏ స్పష్టం చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ నిర్ణయం.. వారెన్ బఫెట్‌కు లక్షల కోట్ల లాభం
- అమెరికా వీసా విధానంతో భారతీయులకు ఎంత నష్టం?
- బోనీ కపూర్ పట్ల శ్రీదేవి ఎలా ఆకర్షితురాలయ్యారు?
- స్లిమ్‌గా కనిపించే శ్రీదేవిని కార్డియాక్ అరెస్ట్ ఎలా కబళించింది?
- 'అదే తొలిసారి నేను శ్రీదేవిని చూడటం'!
- నిద్రలోకి జారే ముందు అసలేం జరుగుతుంది?
- వైన్‌తో ‘దంత సమస్యలు దూరం’!
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









