ప్రాణాలు కాపాడిన వీడియోకాల్

ఫొటో సోర్స్, Opokua Kwapong
- రచయిత, పెరివీన్ అక్తార్
- హోదా, బీబీసీ
సోదరితో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఓ మహిళ.. సాంకేతికతే తన ప్రాణాలు కాపాడిందని పేర్కొంది.
న్యూయార్క్‌కు చెందిన ఒపకువ క్వాపోంగ్ ఆహార శాస్త్రవేత్తగా పని చేస్తుంది. ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది.
ఒకరోజు మాంచెస్టర్‌లో ఉండే సోదరి అడుమెయా సపోంగ్‌కు వీడియో కాల్ చేసింది. ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగుతున్నప్పుడు క్వాపోంగ్ మాటల్లో తడబాటు, ముఖ కవళికలు భిన్నంగా ఉండటం సపోంగ్ గుర్తించింది. తన అక్క ఆరోగ్యం బాగాలేదని గ్రహించింది.
ఆ విషయం క్వాపోంగ్‌కు చెబితే ఆమె మాత్రం వేలాకోళం చేస్తున్నట్లు భావించింది.
'ఆ రోజు అక్కతో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు తాను బాగా అలసిపోయానని నాలుగు అడుగులు వేయాలన్నా ఇబ్బంది అవుతోందని చెప్పింద'ని సపోంగ్ తెలిపింది.

ఫొటో సోర్స్, iStock
'తన పరిస్థితి చూసి అస్ప్రిన్ తీసుకోమని చెప్పా. కానీ, గ్లాసు నీళ్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఆమె ఉంది. ముఖంలో నిస్సత్తువ కనిపించింది. దీంతో వెంటనే కాల్ కట్ చేసి డాక్టర్ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చా. కానీ, నేనే వేళాకోళం చేస్తున్నానని అనుకుంది.
దీంతో డాక్టర్ అయిన ఇంకో సోదరికి కాన్ఫరెన్స్ కాల్ చేసి విషయం చెప్పా. అప్పుడు ఆమె కూడా నాలాగే చెప్పడంతో అక్క అర్థం చేసుకుంద'ని సపోంగ్ నాటి ఘటనను వివరించింది.
ఇద్దరు ఒకేలా చెప్పడంతో క్వాపోంగ్.. వీడియో కాల్ కట్ చేసి వెంటనే అత్యవసర సహాయ సిబ్బందికి సంబంధించిన 911కు కాల్ చేసింది.
ఆస్పత్రిలో స్కానింగ్ తీసి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. క్వాపోంగ్‌కు మొదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు.
బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె ఎడమ వైపు పక్షవాతానికి గురైనట్లు నిర్ధారించారు.

ఫొటో సోర్స్, Getty Images
'నిజం చెప్పాలంటే చెల్లికి చేసిన వీడియోకాలే నా ప్రాణాలు నిలబెట్టింద'ని క్వాపోంగ్ అన్నారు.
'చెల్లి గుర్తించకపోతే నా జీవితం ఏమయ్యేదో! సాంకేతిక నన్ను కాపాడటమే కాదు, స్వంతంత్రంగా జీవించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతోంది. గతంలోలా నేను పెద్దగా ప్రయాణాలు చేయడం లేదు. అన్ని పనులు వీడియోకాల్స్‌తోనే చక్కబెడుతున్నాను' అని క్వాపోంగ్ పేర్కొంది.
'ఆధునిక సాంకేతికత, ఇంటర్నెట్ గురించి ఎక్కువగా నెగిటివ్ మాటలే మనం వింటుంటాం. కానీ, ఇంటర్నెట్ ఒకరి ప్రాణాలను ఎలా కాపాడిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ' అని సపోంగ్ అభిప్రాయపడ్డారు.
'బ్రెయిన్‌స్టోక్ ఏ వయసు వారికైనా, ఏ సమయంలోనైనా రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. సాంకేతికత ఆమె ప్రాణాలు కాపాడింద'ని వైద్య నిపుణుడు ఇస్మీ రస్సెల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
- ఆర్ఎస్ఎస్లో మహిళలు ఏం ధరిస్తారు?
- సైన్స్‌లో చరిత్ర సృష్టించిన ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు
- తన రక్తంతో బట్టలకు రంగులద్దుతోందీమె!
- ‘ఇక్కడ ప్రాణాలు పోతుంటే అక్కడ నేతలు చోద్యం చూస్తున్నారు!’
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








