పింక్ డాల్ఫిన్లను ఎప్పుడైనా చూశారా?
చాలా మంది నలుపు రంగులో ఉండే డాల్ఫిన్లను చూసే ఉంటారు. కానీ, పింక్ డాల్ఫిన్లు కూడా ఉంటాయి.
అత్యంత అరుదైన ఈ జలచరాలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో కనిపిస్తాయి.
అయితే, జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అమెజాన్ నదిలో వేట అధికమైంది.
దాంతో ఈ అరుదైన డాల్ఫిన్ జాతి అంతరించి పోయే పరిస్థితి ఏర్పడుతోంది.
వీటిని పరిరక్షించేందుకు కొలంబియాకు చెందిన జీవశాస్త్రవేత్త ఫెర్నాండో ట్రుజిల్లో 30ఏళ్లుగా కృషి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Fernando Trujillo
అక్రమ వేటను అడ్డుకునేందుకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో పనిచేస్తూ ప్రకృతి ప్రేమికుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన సేవకు గుర్తింపుగా 2007లో వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ అవార్డు కూడా అందుకున్నారు.
అమెజాన్ నదిలో పింక్ డాల్ఫిన్లు ఎలా ఉంటాయి? వాటి పరిరక్షణకు ఫెర్నాండో ఎలా కష్టపడుతున్నారో పై వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









