'జై సింహా'లో బాలకృష్ణ కారెత్తడంపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారు?

ఆనంద్ మహీంద్రా

ఫొటో సోర్స్, Getty Images

సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ నటించిన 'జై సింహా' సినిమా విడుదలైంది. అందులో ఓ సన్నివేశంలో బాలకృష్ణ ఒంటిచేత్తో మహీంద్రా సంస్థకు చెందిన బొలెరో వాహనాన్ని ఎత్తుతూ కనిపిస్తారు.

ఆ సన్నివేశాన్ని విష్ణు చైతన్య అనే వ్యక్తి 'మహీంద్రా గ్రూప్' ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టికి తీసుకెళ్లారు.

'సర్, దీన్ని చూడండి. ఈ దృశ్యాన్ని మీరు మీ కలెక్షన్‌లో భద్రపరచుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో #Bolero ట్రెండింగ్‌లో ఉంది' అంటూ @Chay_Vishnu అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా కూడా ఆసక్తికరంగా బదులిచ్చారు.

'హహా..ఇక మా వర్క్ షాపులకు హైడ్రాలిక్ లిఫ్టులతో అవసరం లేదు. వాటి సాయం లేకుండానే బొలెరో వాహనాల్ని పరీక్షించొచ్చు' అంటూ ఓ సరదా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)