పాకిస్తాన్: మురికివాడల్లో సోలార్ వెలుగులు.. ఆ వెలుగుల్లో పిల్లల చదువులు
- రచయిత, హెన్నా సయీద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ మురికివాడల్లో సోలార్ వెలుగులు వచ్చాయి.. ఆ వెలుగులు ఎంతో మార్పును తెచ్చాయి.. పిల్లలకు చదువులు ఇచ్చాయి!
పగటిపూట ఈ పిల్లలందరూ బాలకార్మికులు.. రాత్రిపూట విద్యార్థులు. ఇదో పాకిస్తానీ యువకుడి ప్రయత్నం.
పాకిస్తాన్‌లో సోలార్ బడులు ప్రారంభమయ్యాయి. ఆ వెలుగులు పిల్లల పుస్తకాలపైనే కాదు.. వారి జీవితాల్లో కూడా ప్రసరించాలంటున్నారు ‘నైట్ స్కూల్’ వ్యవస్థాపకులు రోహిల్ వరింద్.
తాజా గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో 25 లక్షల మంది పిల్లలు చదువులకు దూరంగా పెరుగుతున్నారు. వీరిలో చాలా మంది బాలకార్మికులుగా పనిచేస్తున్నారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు రోహిల్ వరింద్ ప్రయత్నిస్తున్నారు. తన ప్రయత్నానికి పాకిస్తాన్ మురికివాడలను వేదికగా మార్చుకున్నారు.
మురికివాడల్లోని పిల్లల కోసం రాత్రి బడులను ప్రారంభించారు. ఆ బడులు నాలుగు గోడల మధ్య కాదు.. ఆరుబయట వెన్నెల్లో.. సోలార్ వెలుగుల్లో!
‘‘టెర్రరిజం, పేదరికాలతో పోరాడి విజయం సాధించడమే నా కల. వీరంతా విద్యావంతులైతే.. పాకిస్తాన్ అభివృద్ధిలో భాగమవుతారు’’ అంటున్నారు రోహిల్ వరింద్.
2016లో ఫైసలాబాద్‌లోని ఓ మురికివాడలో రోహిల్ వరింద్.. ఈ స్కూలును ప్రారంభించారు.
కానీ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సోలార్ బ్యాటరీలు పూర్తీగా ఛార్జ్ కావడం లేదని, తరగతులను సక్రమంగా నడపలేకపోతున్నామని ఆయన చెబుతున్నారు.
‘‘సోలార్ లైట్ల వెలుగుల్లో స్కూల్ నడుపుతున్నాం. ఈ లైట్లను ఛార్జింగ్ చేయడానికి సూర్య కాంతి అవసరం. కానీ ఇప్పుడున్న ఎండతో బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయలేకపోతున్నాం’’ అంటున్నారు.
కానీ రోహిల్ వరింద్ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు. ఇలాంటి స్కూళ్లను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కలలు కంటున్నారు.
‘‘దేశ వ్యాప్తంగా అన్ని మురికివాడల్లో ఈ స్కూళ్లను ప్రారంభించాలన్నది నా కల. కానీ నేనొక్కడినే ఆ పని చేయలేను. ప్రజల మద్దతు కూడా కావాలి. వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి’’ అని రోహిల్ వరింద్ ఆశిస్తున్నారు.
మా ఇతర కథనాలు
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- ఇక్కడ ఆడపిల్లలు చదువుకోలేరు!
- చదువుల రాణి ఈ తెలంగాణ కళ్యాణి
- విద్యార్థుల ఉసురు తీస్తున్న చదువులు
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- 'తండ్రి పేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్నారు'
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
- పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా?
- గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
- ‘ఆడవాళ్లను ద్వేషించడం, మోసం చేయడం ఇప్పటికీ షరా మామూలే’
- భారత్, పాక్, మధ్యలో ఓ ట్విటర్ అకౌంట్!
- అత్యాచారాలను నిరోధించే ప్యాంటీ తయారు చేసిన యువతి!
- ‘అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్!’
- భారత్ జిందాబాద్ అన్న పాకిస్తానీ అరెస్టు
- పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం నిలిపివేసిన అమెరికా
- పాకిస్తాన్‌లో మార్పు వస్తుందా?
- 'బాబ్రీ' తర్వాత పాకిస్తాన్‌లో కూల్చిన మందిరాలివే!
- భారత్, పాక్, మధ్యలో ఓ ట్విటర్ అకౌంట్!
- పదేళ్లు గడచినా బెనజీర్ హత్య మిస్టరీ ఇంకా ఎందుకు వీడలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













