ఉత్తర కొరియా: అమెరికావి పిరికి పంద చర్యలు.. ఆంక్షలు యుద్ధ చర్యలే

ఫొటో సోర్స్, KCNA
తమ దేశంపై ఐక్యరాజ్య సమితి తాజాగా విధించిన ఆంక్షలు 'యుద్ధ చర్యలే' అని ఉత్తర కొరియా ఆరోపించింది.
తమ దేశాన్ని ఆర్థిక దిగ్బంధనం చేయడం యుద్ధంతో సమానమేనని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యానించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
ఉత్తర కొరియా తన సామర్థ్యాన్ని పెంచుకోవడం, అమెరికాకు మంట పుట్టిస్తోందని ఆయన విమర్శించారు.
ఇటీవల ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి శుక్రవారం తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
ఉత్తర కొరియాకు పెట్రోల్ ఎగుమతులను నిలుపుదల చేస్తూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.
ఈ ఆంక్షలతో ఉత్తర కొరియాకు పెట్రోల్ దిగుమతులు 90% మేర తగ్గుతాయి.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా తాజా ప్రకటనలో ఏముంది?
"ఇది తమ ప్రభుత్వ సార్వభౌమికాధికారాన్ని దెబ్బతీసే హింసాత్మక చర్య. కొరియా ద్వీపకల్పంలో శాంతికి భంగం కలిగించే యుద్ధ చర్య" అని ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమెరికా పిరికి పంద చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించింది.
అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని, ఆ దేశ రెచ్చగొట్టే చర్యలను, బ్లాక్ మెయిలింగ్‌లను తిప్పికొట్టేందుకు తమ బలగాలను మరింత సంఘటితం చేసుకుంటామని ఉత్తర కొరియా పేర్కొంది.
మా ఇతర కథనాలు:
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- ఆంక్షలకు లొంగేది లేదు: ఉత్తర కొరియా
- ‘వన్నాక్రై సైబర్ దాడి చేసింది ఉత్తర కొరియానే’
- ‘ఉత్తర కొరియా ప్రపంచాన్ని భయపెడుతోంది’
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- అమెరికా: ఉత్తర కొరియాకు యుద్ధమే పరిష్కారం కాదు
- ఉత్తర కొరియా: అమెరికా మొత్తం మా క్షిపణి పరిధిలో ఉంది
- కొరియా తీరంలో అమెరికా ‘యుద్ధ’ విన్యాసం
- దాణా కుంభకోణంలో లాలూ దోషి, 3న శిక్ష ఖరారు
- 'నేనొస్తే... ఒత్తిడి పెరుగుతుంది': పవన్ కల్యాణ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








