ఉత్తర కొరియా సంక్షోభం: అమెరికా యుద్ధ విమానాల కసరత్తు మొదలు

ఫొటో సోర్స్, AFP
దక్షిణ కొరియాతో కలిసి నిర్వహించిన మిలటరీ డ్రిల్‌లో.. అమెరికా రెండు యుద్ధ విమానాలను కొరియా భూభాగం మీదుగా ప్రయోగించింది.
దక్షిణ కొరియాకి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాలతో పాటు అమెరికాకి చెందిన బీ-1బీ యుద్ధ విమానాలు కూడా దక్షిణ కొరియా సముద్ర జలాల మీదుగా యుద్ధ విన్యాసాలు చేశాయి.
అమెరికా-ఉత్తర కొరియా మధ్య ప్రస్తుతం వివాదాస్పద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికాకి చెందిన రెండు బాంబర్లు(యుద్ధ విమానాలు) మంగళవారం దక్షిణ కొరియాకు చేరుకొని ఈస్ట్ సీ, ఎల్లో సీ మీదుగా ఫైరింగ్‌ని సాధన చేశాయని దక్షిణ కొరియా మిలటరీ విభాగం తెలిపింది.
ఉత్తర కొరియాను హెచ్చరించే ప్రక్రియలో భాగంగానే ఈ డ్రిల్‌ని నిర్వహించినట్లు అది పేర్కొంది.
జపాన్ వైమానిక దళం కూడా ఈ కసరత్తులో పాల్గొందని అమెరికా చెబుతోంది.
ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా బెదిరింపులను ఎలా ఎదుర్కోవాలో వివరించేందుకు అమెరికా జాతీయ భద్రతా దళం అధికారులతో మంగళవారం ట్రంప్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








