బుజ్జిగాడి సంపాదన ఏడాదికి రూ.70 కోట్లు

బొమ్మలతో ఆడుకుంటున్న రేయాన్

ఫొటో సోర్స్, Youtube/RyanToysReview

6 సంవత్సరాలు.. రూ.70 కోట్లు.. కోటి మంది యూ ట్యూబ్ సబ్‌స్క్రైబర్లు.. ఈ గణాంకాలు ఏమిటబ్బా అనుకుంటున్నారా?

ఇదిగో బుడతడి వయసు 6 ఏళ్లు. ఈ బుజ్జిగాడి ఏడాది సంపాదన రూ.70 కోట్లు.

ఇంత చిన్న వయసులో అంత ఎలా సంపాదిస్తున్నాడని ఆశ్చర్యపోకండి.

ప్రతి రోజూ కొత్త బొమ్మలతో ఆడుకుంటాడు అంతే.

రేయాన్ యూ ట్యూబ్ ఛానెల్

ఫొటో సోర్స్, Youtube/RyanToysReview

ఇంతకు బుడతడు ఎవరు? ఎక్కడ ఉంటాడు?

ఆ బుడ్డోడి పేరు రేయాన్. దేశం అమెరికా. ఈ చిన్నారికి రేయాన్ టాయ్స్ రివ్యూ పేరిట యూ ట్యూబ్‌ ఛానెల్ ఉంది.

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం రాయల్టీ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న యూ ట్యూబ్ ఛానెళ్లలో ఇది 8వ స్థానంలో ఉంది.

2017లో యూ ట్యూబ్ ద్వారా అత్యధికంగా ఆర్జించిన వారి జాబితాలో రేయాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

రేయాన్ రోజూ రకరకాల బొమ్మలతో ఆడుకుంటాడు. వాటికి సంబంధించిన వీడియోలను యూ ట్యూబ్‌లో పెడతాడు.

ఈ ఛానెల్‌ను 2015లో ప్రారంభించారు. ప్రస్తుతం దానికి కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

సోషల్ మీడియా చిత్రాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఆలోచన ఎలా వచ్చింది?

ఆట బొమ్మలు, చిన్నపిల్లలకు సంబంధించి యూ ట్యూబ్ ఛానెళ్లను చూడటం రేయాన్‌కు ఎంతో ఇష్టం. వాళ్ల మాదిరిగా తాను కూడా యూ ట్యూబ్‌లో కనిపించాలని ఆశపడటంతో ప్రత్యేకంగా ఒక ఛానెల్ ప్రారంభించినట్లు మీడియా సంస్థ ట్యూబ్‌ఫిల్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేయాన్ తల్లి చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

తేడా ఏంటి?

ఇతర ఆట బొమ్మల ఛానెళ్లకు రేయాన్ ఛానెల్‌కు ఉన్న తేడా రేయానే.

అందరూ బొమ్మల గురించి వివరించడం, వాటి ప్రత్యేకతలు చెప్పడం చేస్తుంటారు. రేయాన్ మాత్రం తన రీతిలో తాను వాటితో ఆడుకుంటాడు.

ఇదే రేయాన్‌ను ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంచింది.

ఆట బొమ్మల షాపు

ఫొటో సోర్స్, Getty Images

డబ్బుల కోసమే

అయితే డబ్బుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లల చేత బలవంతంగా ఇలాంటివి చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

"డబ్బుల కోసం పిల్లలను తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నట్లు" ప్రముఖ యూ ట్యూబర్ పేవ్‌డీపే అన్నారు.

"రేయాన్‌ను ఒత్తడి చేయడం లేదు. అతని చదువుకు ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు. సెలవు రోజునే వీడియోలను రికార్డు చేస్తున్నాం" అని రేయాన్ తల్లి చెబుతున్నారు.

అయితే ఈ ఛానెల్‌పై తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇది ఎంతో బాగుందంటే, తమ పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని మరికొందరు అంటున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)