పిల్లల స్మార్ట్‌వాచీల్లో భద్రత లేదంటున్న నిపుణులు

ఫొటో సోర్స్, NCC
పిల్లల భద్రత కోసం వినియోగించే స్మార్ట్ వాచీలు చాలా 'సులువు'గా హ్యాకర్ల బారిన పడే ప్రమాదముందని నార్వే నిపుణులు హెచ్చరించారు.
రెండు, మూడేళ్లుగా స్మార్ట్ వాచీల ట్రెండ్ బాగా పెరిగింది. పిల్లల భద్రత కోసమంటూ చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. జీపీఎస్ ద్వారా ఈ వాచీ ధరించిన వారి కదలికలను ఎక్కడి నుంచైనా ఓ కంట కనిపెట్టే వీలుంటుంది.
అయితే వివిధ సంస్థలు విడుదల చేసిన పిల్లల స్మార్ట్ వాచీలను నార్వే వినియోగదారుల కౌన్సిల్ (ఎన్‌సీసీ) పరీక్షించింది. ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉండే ఈ వాచీలలోని లోపాల కారణంగా హ్యాకర్లు సులువుగా ట్రాక్ చేసే ప్రమాదముందని వెల్లడించారు.
దాంతో వాచీని ధరించిన వారి సంభాషణలను హ్యాకర్లు దొంగచాటుగా వినడం, మాట్లాడటంతో పాటు, జీపీఎస్ లొకేషన్ డేటాను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, NCC
ఎన్‌క్రిప్ట్ అవ్వకుండానే ఈ వాచీల నుంచి సమాచారం బయటకు వెళ్తోందని, దాన్ని మూడో వ్యక్తి సులువుగా ట్రాక్ చేసే వీలుందని ఎన్‌సీసీ చెబుతోంది. ఈ భద్రతా లోపాలను సరిదిద్దకుండా అమ్మడానికి వీళ్లేదని కౌన్సిల్ స్పష్టం చేసింది.
దీనిపై స్పందించిన రిటైలింగ్ సంస్థ జాన్ లెవిస్ ఓ ప్రముఖ బ్రాండ్ స్మార్ట్‌వాచీ అమ్మకాలను సైతం నిలిపివేసింది.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల స్మార్ట్‌వాచీల అమ్మకాలు జరగొచ్చని సింగపూర్‌లోని మార్కెట్ విశ్లేషణ సంస్థ కెనలిస్ అంచనా వేసింది. భారత్‌లోనూ స్మార్ట్‌వాచీల కొనుగోళ్లు భారీగానే ఉంటున్నాయి.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








