కిర్కుక్‌ను ఆక్రమించుకున్న ఇరాక్ బలగాలు

ఫొటో సోర్స్, AFP
ఇరాక్‌లోని వివాదాస్పద కిర్కుక్ నగరంపై పట్టు కోసం జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వ బలగాలు కుర్దిష్ పోరాట యోధులపై పైచేయి సాధించాయి.
కిర్కుక్ వెలుపల ఉన్న మిలటరీ బేస్‌ను, ఒక ఆయిల్, గ్యాస్ ఫీల్డ్‌ను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ బలగాలు, నగరం మధ్య భాగానికి చేరుకున్నాయి.
సోమవారం ఉదయం కిర్కుక్‌లో అల్లర్లు ప్రారంభం కావడంతో వేలాది మంది నగరాన్ని విడిచి పారిపోయారు.
కుర్దిస్తాన్ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలంటూ రెఫరెండం నిర్వహించిన మూడు వారాల అనంతరం ఈ సంఘటన చోటు చేసుకుంది.

కిర్కుక్ ఇరాకీ కుర్దిస్తాన్ లోపల లేనప్పటికీ, నగరంలోని కుర్దిష్ ఓటర్లు ఆ రెఫరెండంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
కిర్కుక్‌తో పాటు కుర్దుల నియంత్రణలో ఉన్న ప్రాంత ప్రజలు రెఫరెండానికి అనుకూలంగా ఓటు వేశారు.
ఇరాకీ ప్రధానమంత్రి ఈ రెఫరెండంను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు.
అయితే కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం (కేఆర్‌జీ) మాత్రం అది చట్టబద్ధమే అని పేర్కొంది.
ఇరాక్‌లో పరిస్థితిని అదుపు చేయడానికి అన్ని వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








