దుల్హనియా లుక్ చూపిస్తున్న పాకిస్తాన్ మోడల్స్

ఫొటో సోర్స్, ARIF ALI/AFP/GETTY IMAGES
పాకిస్తాన్‌లో లాహోర్ నగరాన్ని ఫ్యాషన్ రాజధాని అని అంటారు. ఈసారి పాకిస్తాన్ ఫ్యాషన్ వీక్ లాహోర్‌లో అక్టోబరు 14న ప్రారంభమై 16న ముగిసింది.

ఫొటో సోర్స్, ARIF ALI/AFP/GETTY IMAGES
బ్రైడల్ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్లు తాము రూపొందించిన అదరగొట్టే డిజైన్లను ప్రదర్శించారు. ఈ డిజైన్లు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఫొటో సోర్స్, ASIF HASSAN/AFP/GETTY IMAGES
ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఈ డిజైన్లు పెళ్ళికి ముస్తాబయ్యే వధువులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఫొటో సోర్స్, ARIF ALI/AFP/GETTY IMAGES
ఈ ఈవెంట్ బ్రైడల్ ఫ్యాషన్‌కే కొత్త ఊపునిస్తుందని ఫ్యాషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, ARIF ALI/AFP/GETTY IMAGES
వసీం ఖాన్‌తో పాటు అలీ హసన్, నూమి అన్సారీ, ఫహద్ హుసేన్, సానియా సఫీనా ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫొటో సోర్స్, ARIF ALI/AFP/GETTY IMAGES
ఈ ఫ్యాషన్ షోలో సదఫ్ ఫవాద్ ఖాన్ తన అందాలతో తళుక్కున మెరిశారు. ప్రముఖ డిజైనర్ వసీం ఖాన్ ఈ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు.

ఫొటో సోర్స్, ASIF HASSAN/AFP/GETTY IMAGES
ఆమె ప్రముఖ పాకిస్తాన్ సినిమా స్టార్, బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ ఫవాద్ ఖాన్ భార్య.
పాకిస్తాన్‌లో జరుగుతున్న ఇలాంటి ఈవెంట్లు ఆ దేశ ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త ఊపునిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








